ఎదురు చూసి చూసి అలసిపోయిన మెగా ఫ్యాన్స్ కి ఊరట కలిగిస్తూ విశ్వంభర విడుదలకు రంగం సిద్ధమవుతోంది. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ చాలా నెలలుగా మీడియా కెమెరాకు దూరంగా ఉన్న దర్శకుడు వశిష్ట ఎట్టకేలకు బయటికి వచ్చాడు. ఇంటర్వ్యూల రూపంలో తన మనసులో మాటలు బయటపెడుతున్నాడు. ఇంకొక్క స్పెషల్ సాంగ్ మాత్రమే బ్యాలన్స్ ఉన్న నేపథ్యంలో దాన్ని జూలై 25 నుంచి మొదలుపెట్టి గుమ్మడికాయ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అక్టోబర్ లో రిలీజవుతుందనే సంకేతం ఇచ్చాడు. పక్కాగా కాదు కానీ ఫైనల్ అవుట్ ఫుట్ సంతృప్తికరంగా వస్తే అప్పుడు లాక్ చేస్తామని అన్నాడు.
సిజి వర్క్స్ వల్లే విశ్వంభర ఆలస్యమయ్యిందని ఒప్పుకున్న వశిష్ట బెస్ట్ క్వాలిటీ కోసం ఇంత కష్టపడ్డామని చెప్పుకొచ్చాడు. ఈ సంగతి కాసేపు పక్కనపెడితే సెప్టెంబర్ లో విశ్వంభర రావొచ్చని జరిగిన ప్రచారానికి దీంతో చెక్ పడినట్టే. ఓజి, అఖండలో ఏదో ఒకటి తప్పుకుంటే ఆ స్థానంలో మెగా మూవీ వస్తుందనే గాసిప్ గట్టిగానే తిరిగింది. అయితే అప్పటికంతా వర్క్స్ పూర్తయ్యేలా లేకపోవడంతో అక్టోబర్ బెస్ట్ ఆప్షన్ గా భావిస్తున్నారు కాబోలు. ఆ నెలలో ఇప్పటిదాకా అఫీషియల్ గా లాక్ చేసుకుంది సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా ఒకటే. రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా కూడా ఆ ఆప్షన్ వైపు చూస్తోంది. కాంతార ఫస్ట్ వీక్ లోనే వచ్చేస్తుంది.
ఇప్పటికి క్లారిటీ దొరికినా విశ్వంభర ఖచ్చితంగా అక్టోబర్ లోనే వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఫైనల్ కట్ అయ్యాక చిరంజీవితో పాటు టీమ్ మొత్తం సంతృప్తి చెందాలి. పైగా వసిష్ఠ చెప్పిన ప్రకారం కొత్త కొత్త లోకాలు, అల్లావుద్దీన్ తరహా పాత్రలు, విచిత్ర ప్రాణుల విన్యాసాలు ఇలా బోలెడు సరంజామా ఉంది. టీజర్ విషయంలో వచ్చిన నెగటివిటీ ఉద్దేశపూర్వకంగా వచ్చిందని చెబుతున్న వసిష్ఠ థియేటర్లలో అంత బ్యాడ్ గా లేదని కవర్ చేయడం గమనార్హం. వీటి సంగతి ఎలా ఉన్నా ఆలస్యం వల్ల బజ్ బాగా తగ్గిపోయిన విశ్వంభరకు అగ్రెసివ్ ప్రమోషన్లు చేస్తే తప్ప జనంలో హైప్ తేవడం కష్టం.
This post was last modified on July 17, 2025 10:19 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…