Movie News

సంక్రాంతికి వస్తున్నాం.. ఓటీటీ డీల్ కాకుండానే

ఈ ఏడాది థియేటర్ల దగ్గర జనాల జాతర తీసుకొచ్చిన సినిమా అంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చెప్పాలి. సంక్రాంతి పండక్కి రిలీజైన ఈ చిత్రం అలా ఇలా ఆడలేదు. పోటీలో ఉన్న గేమ్ చేంజర్, డాకు మహారాజ్ లాంటి పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి ఇది లీడర్‌గా మారింది. జనం విరగబడి చూశారీ చిత్రాన్ని. ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లతో ఔరా అనిపించింది. ఐతే జనం ఇంతగా కనెక్ట్ అయి బ్లాక్ బస్టర్ చేసిన సినిమాకు రిలీజ్ ముంగిట ఓటీటీ డీల్ జరగలేదట. ఈ విషయాన్ని వెంకటేష్ అన్న కొడుకు, నటుడు దగ్గుబాటి రానా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. 

థియేటర్లకు వచ్చే జనం అంతకంతకూ తగ్గిపోతుండడం.. దీనికి అర్లీ ఓటీటీ డీల్స్ కారణం అవుతుండడం గురించి ఒక ఇంటర్వ్యూలో రానా మాట్లాడాడు. తన బాబాయి సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’కు రిలీజ్ ముంగిట డిజిటల్ డీల్ జరగలేదని ఈ సందర్భంగా రానా వెల్లడించాడు. అయినా అలాగే సినిమాను రిలీజ్ చేశారని.. జనం ఎగబడి చూశారని.. ప్రేక్షకుల్లో థియేటర్లకు వచ్చి సినిమా చూడడానికి ఇంత ఆసక్తి ఉందా అనిపించేలా ఈ చిత్రం ఆడిందని రానా తెలిపాడు. ఇప్పటికే సినిమాల కోసం థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని.. వాళ్లను రప్పించే సినిమా తీయడం ముఖ్యమని రానా తెలిపాడు.

ఈ సందర్భంగా రానా ఐఎండీబీలో తన టాప్-5 బెస్ట్ వాచ్ లిస్ట్ కూడా చెప్పాడు. ‘స్టార్ వార్స్’ తన ఆల్ టైం ఫేవరెట్ అని రానా చెప్పాడు. మణిరత్నం-కమల్ హాసన్‌ల ‘నాయగన్’కు రానా సెకండ్ ప్లేస్ ఇచ్చాడు. ఇక హాలీవుడ్ మూవీ ‘స్టార్ ఫేస్’ను తాను అదే పనిగా చూస్తూ ఉంటానని రానా తెలిపాడు. ఇంకా గ్లాడియేటర్, లాక్ స్టాక్ అండ్ టు స్మోకింగ్ బారెల్స్ తనకు ఆల్ టైం ఫేవరెట్ సినిమాలని రానా తెలిపాడు.

This post was last modified on July 17, 2025 6:51 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago