కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో తాజాగా సంచలనం నిర్ణయం తీసుకుంది. ఏ సినిమాకైనా సరే.. మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ.200కు మించకూడదంటూ జీవో ఇచ్చింది. దక్షిణాదిన టికెట్ల ధరలు అధికంగా ఉండే నగరాల్లో బెంగళూరు ఒకటి. అక్కడ మల్టీప్లెక్సుల్లో ఫ్లెక్సీ ప్రైసింగ్ అమల్లో ఉంది. అంటే డిమాండును బట్టి ఎంతైనా రేటు పెంచుకుంటారన్నమాట. ఈ ప్రకారం కొన్ని సినిమాలకు రూ.800 నుంచి 1000 వరకు కూడా రేటు పెడుతుంటారు. మల్టీప్లెక్సుల్లో క్రేజున్న పెద్ద సినిమాలకు 400 మించి రేటు పెట్టాల్సిన పరిస్థితి. ఐతే దీని మీద జనం నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం రూ.200 క్యాప్ పెడుతూ జీవో ఇచ్చింది. ఇది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు షాకే.
అదే సమయంలో రేట్లు తగ్గితే ఫుట్ ఫాల్స్ పెరిగి అంతిమంగా వీళ్లకు మేలే జరుగుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రేక్షకుల నుంచి అయితే ఈ నిర్ణయం పట్ల సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో సౌత్ ఇండియాలో మిగతా రాష్ట్రాల్లో టికెట్ల ధరలు ఎలా ఉన్నాయి అని ఒకసారి పరిశీలిస్తే.. తెలంగాణలో మరే స్టేట్ అందుకోలేని స్థాయిలో ఉన్నాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్ టికెట్ రేటు రూ.295. సింగిల్ స్క్రీన్స్ ధర రూ.150 నుంచి 175 ఉంటోంది. ఏపీలో మల్టీప్లెక్స్ రేటు రూ.180, సింగిల్ స్క్రీన్ టికెట్ ధర సినిమాను బట్టి రూ.112 నుంచి 150 మధ్య ఉంటోంది.
ఏపీలో ఓ మోస్తరు సినిమాలకు కూడా తొలి వారం ఎక్స్‌ట్రా రేట్లు ఉంటున్నాయి. మల్టీప్లెక్సుల్లో రూ.75 నుంచి 100, సింగిల్ స్క్రీన్లలో రూ.50 నుంచి రూ.75 పెంచుతున్నారు. తెలంగాణలో గత ఏడాది డిసెంబరు వరకు సినిమా క్రేజును బట్టి ఇష్టానుసారం రేట్లు పెంచుకునేవారు. కానీ ‘పుష్ప-2’ తర్వాత బ్రేక్ పడింది. ‘హరిహర వీరమల్లు’ నుంచి మళ్లీ అదనపు రేట్లకు అనుమతులు వస్తాయంటున్నారు. ఈ సంగతి పక్కన పెట్టి సౌత్ ఇండియాలో మిగతా రాష్ట్రాల సంగతి చూస్తే.. తాజా జీవో ప్రకారం ఇకపై కర్ణాటకలో మల్టీప్లెక్సుల్లో రేటు రూ.200కు మించదు.
సింగిల్ స్క్రీన్లలో అక్కడ రూ.110 నుంచి రూ.150 మధ్య రేటు ఉంటోంది. చెన్నైలో చాలా ఏళ్లుగా మల్టీప్లెక్స్ రేటు రూ.190తో అందుబాటులో ఉండదు. అక్కడ అదనపు రేట్లు ఉండవు. సింగిల్ స్క్రీన్ ధర రూ.110 నుంచి రూ.150 వరకు ఉంటోంది. ఇక కేరళలో మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.180. సింగిల్ స్క్రీన్ రేట్ రూ.130 నుంచి రూ.150 మధ్య ఉంటోంది. దీన్ని బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ధరలు అన్నది స్పష్టం. మామూలుగానే అధిక రేట్లు అంటే.. పెద్ద సినిమాలకు రేట్లు పెంచి ప్రేక్షకుల మీద మరింత భారం మోపుతున్నారు. అందుకే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోందన్నది స్పష్టం.
This post was last modified on July 16, 2025 6:04 pm
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…