ఆర్ఆర్ఆర్.. పగలూ రాత్రీ తేడా లేకుండా
ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సినిమా అంటే ‘ఆర్ఆర్ఆర్’యే. ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే.. ఈపాటికి సినిమా విడుదల కావడమో లేదా విడుదలకు చేరువగా ఉండటమో జరగాల్సింది. కానీ అనుకున్న ప్రణాళికలు ఫలించలేదు. ఒకసారి సినిమాను వాయిదా వేసి 2021 సంక్రాంతికి ఫిక్స్ చేసినప్పటికీ.. కరోనా ఈ ప్లాన్లను దెబ్బ కొట్టేసింది.
ఒకసారి సినిమా మొదలుపెట్టాక విరామం లేకుండా పని చేసే రాజమౌళి.. కరోనా ధాటికి ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆరేడు నెలల విరామం తర్వాత ఎట్టకేలకు గత నెలలో ఆయన ‘ఆర్ఆర్ఆర్’ పని పున:ప్రారంభించారు. మధ్యలో టీజర్ కోసం కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న రాజమౌళి బృందం.. మళ్లీ విరామం లేకుండా పని చేస్తోంది. పగలూ రాత్రీ తేడా లేకుండా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ సాగుతుండటం గమనార్హం. విపరీతమైన చలిలో, ఇబ్బందికర పరిస్థితుల్లో షూటింగ్ చేస్తోంది జక్కన్న బృందం.
తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ట్విట్టర్ పేజీలో ఒక వీడియోను షేర్ చేశారు. అది ‘ఆర్ఆర్ఆర్’ ఆన్ లొకేషన్‌ది కావడం విశేషం. చిత్ర బృందంలోని వాళ్లందరూ చలికి వణికిపోతూ లొకేషన్లో పెట్టిన మంట దగ్గర చలికాచుకుంటుండటం అందులో కనిపిస్తోంది. రేపు నీళ్లలో కూడా దిగబోతున్నామంటూ రాజమౌళి తన టీంను మరింత కష్టపెట్టబోతున్న విషయాన్ని వెల్లడించాడు.
రాజమౌళి రంగంలోకి దిగాడంటే పని రాక్షసుడిగా మారిపోతాడని, అసలు కనికరం ఉండదని అంటారు. కరోనా వల్ల ప్రొడక్షన్ పరంగానే కాక అన్ని రకాలుగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో జక్కన్న ఇప్పుడు మరింత కఠినంగా మారిపోయి తన టీంను కష్టపెడుతున్నాడట. సాధ్యమైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అంచనాలు ప్రకారం చూస్తే ‘ఆర్ఆర్ఆర్’ 2021 ద్వితీయార్ధంలో కానీ విడుదలయ్యే అవకాశం లేదు. 2020 జులై 30కి అనుకున్న ఈ చిత్రం.. తర్వాతి ఏడాది ఆ తేదీకి వచ్చే అవకాశాలున్నాయి. లేదంటే ఆగస్టు 15 అదీ కుదరదంటే దసరాకు సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చు.
This post was last modified on November 17, 2020 2:27 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…