స్టార్ డైరెక్టర్లు కేవలం దర్శకత్వానికి పరిమితం కాకుండా.. ప్రొడక్షన్లోకి దిగడం.. చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు రచనా సహకారం అందించడం లాంటివి మామూలే. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, పూరి జగన్నాథ్.. ఇలా చాలామంది దర్శకులు ఈ తరహా ప్రయత్నాలు చేసిన వాళ్లే. గత కొన్నేళ్లలో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన అనిల్ రావిపూడి సైతం ఈ జాబితాలో చేరాడు. అతను కూడా ‘సమర్పకుడు’గా మారాడు. అలాగే ఆ సినిమాకు రచనా సహకారం కూడా అందించాడు. ఆ చిత్రం పేరు.. గాలి సంపత్.
రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ఇది. సోమవారమే ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. నిన్ను కోరి, మజిలీ సినిమాలను నిర్మించిన సైన్ స్క్రీన్స్ అధినేతలు సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి ఎస్.కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ ముగ్గురూ అనిల్‌కు మిత్రులే. ఈ నేపథ్యంలో అనిల్ కూడా ఈ ప్రాజెక్టులో నిర్మాణ భాగస్వామి అయ్యాడు. అలాగే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నాడు. అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. సాయి అనే రచయిత కథ అందించాడు.
ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తే గాలి సంపత్ అనే వ్యక్తి శ్రీ విష్ణునే అనుకుంటాం. కానీ ఆశ్చర్యకరంగా ఆ పాత్రను పోషిస్తున్నది రాజేంద్ర ప్రసాద్ కావడం విశేషం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఇలా పెద్ద వయస్కుడికి టైటిల్ రోల్ ఇవ్వడం చూస్తే ఇదో విభిన్న ప్రయత్నంలాగే అనిపిస్తోంది. ఇలాంటి సినిమాకు కమర్షియల్ చిత్రాల దర్శకుడు అనిల్ స్క్రీన్ ప్లే అందించం ఆశ్చర్యం కలిగించే విషయమే. రాజేంద్ర ప్రసాద్ అంటే అనిల్‌కు ప్రత్యేక అభిమానం. అందుకే తన సినిమాల్లో ఆయనకు ప్రత్యేక పాత్రలు ఇస్తుంటారు. ఇప్పుడు ఆయన లీడ్ రోల్ చేస్తున్న సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తూ, నిర్మాణ భాగస్వామి కావడం విశేషమే.
This post was last modified on November 17, 2020 1:51 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…