బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమ్’ తర్వాత లోకేష్ కనకరాజ్ రూపొందించిన ‘లియో’ సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ ఆ చిత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. అందులో హీరో సహా చాలా పాత్రలు తేలిపోయాయి. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ పాత్ర సైతం హాఫ్ బేక్డ్ అనిపించింది. ఈ విషయంలో సంజయ్ దత్ సైతం అసంతృప్తితో ఉన్న విషయం ఇటీవలే వెల్లడైంది. ‘కేడీ: ది డెవిల్’ అనే కన్నడ అనువాద చిత్రం ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ‘లియో’లో తన పాత్రను వేస్ట్ అయిందని.. ఈ విషయంలో దర్శకుడు లోెకేష్ కనకరాజ్ మీద కోపంగా ఉన్నానని సంజు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
సంజయ్ దత్ సరదాగానే ఈ మాట అన్నట్లు కనిపించినా.. మీడియాలో ఆ విషయం బ్లో అప్ అయిపోయింది. ఇదే విషయమై ‘కూలీ’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ స్పందించాడు. ఈ కామెంట్స్ తర్వాత సంజయ్ దత్ తనకు కాల్ చేసి మాట్లాడినట్లు లోకేష్ వెల్లడించాడు. తాను సరదాగానే ఆ కామెంట్ చేశానని.. కానీ సోషల్ మీడియాలో జనాలు మరో రకంగా స్పందించారని సంజు తనతో చెప్పినట్లు లోకేష్ తెలిపాడు.
తానేమీ జీనియస్ డైరెక్టర్‌ను కానని.. తప్పులు జరుగుతాయని.. వాటి నుంచి నేర్చుకునే దశలోనే ఉన్నానని లోకేష్ తెలిపాడు. భవిష్యత్తులో సంజయ్ దత్‌ను మంచి పాత్రలో చూపించడానికి ప్రయత్నిస్తానని లోకేష్ అన్నాడు. ఇక ‘కూలీ’ సినిమా గురించి మాట్లాడుతూ.. దీన్ని రజినీకాంత్ ‘దళపతి’తో పోల్చినట్లు లోకేష్ తెలిపాడు. ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందా అని అడిగితే.. కలెక్షన్ల కంటే ప్రేక్షకుడు టికెట్ మీద పెట్టే 150 రూపాయల మీదే తన ఫోకస్ ఉంటుందని.. ఆ డబ్బులకు న్యాయం చేసే సినిమా ఇదని లోకేష్ అన్నాడు. ‘లియో’ సినిమా 600 కోట్లు వసూలు చేయడం వల్ల ‘కూలీ’కి తన పారితోషకం రెట్టింపు అయి రూ.50 కోట్లకు చేరిందని అతను చెప్పడం విశేషం.
This post was last modified on July 15, 2025 2:18 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…