రాసిపెట్టి ఉంటే ఏదైనా సరే దక్కే తీరుతుంది. సినీ పరిశ్రమలో దీనికి చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. ఒక హీరో కోసం రాసుకున్న స్క్రిప్ట్ ఇంకో స్టార్ కు వెళ్ళిపోయి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన ఉదంతాలు ఎన్నో. ఉదాహరణకు పోకిరిని రవితేజ, త్రిషలను దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేసిన పూరి జగన్నాథ్ దాన్ని మహేష్ బాబు, ఇలియానాతో తీసి ఎన్ని సంచలనాలు నమోదు చేశాడో చెబితే చరిత్రే అవుతుంది. అయితే ఒక సపోర్టింగ్ ఆర్టిస్టుకు ఇలాంటి అనుభవం ఎదురు కావడం విచిత్రమే. దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్వయంగా చెప్పాకే కూలికి సంబంధించిన ఒక ఇంటరెస్టింగ్ బైట్ బయటికి వచ్చింది.
కూలి స్క్రిప్ట్ రాసుకున్న టైంలో ఒక క్యారెక్టర్ ని లోకేష్ కనగరాజ్ ఆరు నెలల పాటు డిజైన్ చేసుకున్నాడు. దాని కోసం ఎక్కువ గుర్తింపు ఉన్న స్టార్ అవసరమని భావించి పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ ని కలిశాడు. అయితే డేట్లు అందుబాటులో లేని కారణంగా దాన్ని అతను వదులుకున్నాడు. దీంతో లోకేష్ సౌబిన్ షాహిర్ ని కలిశాడు. రజినీకాంత్ సినిమా, అందులోనూ ఇంత ప్రధాన్యం ఉండే క్యారెక్టర్ దక్కేసరికి నో అని ఎందుకు అంటాడు. వెంటనే ఒప్పేసుకున్నాడు. కట్ చేస్తే మౌనికా అనే పాటలో బుట్టబొమ్మ పూజా హెగ్డేని డామినేట్ చేసే రేంజ్ లో తను చేసిన డాన్స్ విపరీతమైన గుర్తింపు తీసుకొస్తోంది.
ఒకరకంగా చూసుకుంటే ఫహద్ ఫాసిల్ ది బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఒకవేళ కూలీ చేసుంటే పుష్ప తరహాలో మరో ల్యాండ్ మార్క్ మూవీ అయ్యేదేమో. రజనీకాంత్ తో గతంలో వెట్టయన్ లో స్క్రీన్ పంచుకున్న ఫహద్ ఫాసిల్ ప్రస్తుతం జైలర్ 2 లో కూడా ఉన్నాడు. అందుకే కూలి మిస్ కావడం పెద్దగా లోటు అనిపించకపోవచ్చు. కాకపోతే కమల్ హాసన్ విక్రమ్ లో తనకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో మరో ఆఫర్ వదులుకోవడం ఖచ్చితంగా వెలితే. ఒక్కోసారి ఆర్టిస్టులు మరీ బిజీగా మారిపోయినా బంగారం లాంటి అవకాశాలు తృటిలో తప్పిపోయి మర్చిపోలేని అసంతృప్తిని మిగులుస్తాయి.
This post was last modified on July 15, 2025 11:33 am
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…