Movie News

అఖండ-2కు కొత్త డేట్?

ఈ ఏడాది పెద్ద సినిమాల సందడి లేదని ఫీలవుతున్న ప్రేక్షకులకు రాబోయే నాలుగైదు నెలల్లో రాబోయే చిత్రాలు బాగానే లోటును భర్తీ చేసేలా కనిపిస్తున్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్లకు చెందిన పలు చిత్రాలు చివరి నాలుగైదు నెలల్లో రాబోతున్నాయి. ఇంకో 10 రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ రాబోతోంది. తర్వాత ఆగస్టులో ‘వార్-2;’ ‘కూలీ’ చిత్రాలు సందడి చేయబోతున్నాయి. ఆ తర్వాత సెప్టెంబరుకు రెండు మూడు భారీ చిత్రాలే షెడ్యూల్ అయి ఉన్నాయి. ఐతే వాటిలో ‘ఓజీ’ మాత్రమే చెప్పిన డేటుకు వచ్చేలా ఉంది. సెప్టెంబరు 25న ‘ఓజీ’తో పోటీ పడాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడడం గ్యారెంటీ అన్నది తాజా సమాచారం.

ఇప్పటిదాకా వాయిదా అంటూ అధికారికంగా ఏమీ ప్రకటించకపోయినా.. గత నెలలో రిలీజ్ చేసిన టీజర్లో కూడా అదే డేట్ ప్రకటించినా… యూనిట్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం సినిమా పోస్ట్ పోన్ కానుందట. ‘అఖండ-2’ చిత్రీకరణ చాలా వరకు పూర్తయింది. కొంత టాకీ పార్ట్, పాటలు చిత్రీకరించాల్సి ఉంది. ప్రయాగలో అనుకున్న చివరి షెడ్యూల్ వర్షాల వల్ల క్యాన్సిల్ అయింది. దీంతో చిత్రీకరణ కొంత ఆలస్యం కానుంది. దీనికి తోడు విజువల్ ఎఫెక్ట్స్ పనులకు చాలా రోజులే పడుతుందట.

మరోవైపు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో గట్టిగా ప్రమోట్ చేసి భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే సెప్టెంబరు రిలీజ్ అంటే హడావుడి అవుతుంది. అందుకే డిసెంబరు మీదకి ఫోకస్ షిఫ్ట్ అయినట్లు సమాచారం. ‘అఖండ’ సైతం డిసెంబరులోనే రిలీజైన సంగతి గమనార్హం. ప్రస్తుతానికి డిసెంబరు 18 అనుకుంటున్నారట. త్వరలోనే డేట్ ఖరారు చేసి, మీడియాకు అధికారికంగా అప్‌డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నాడు.

Share

Recent Posts

కర్ణుడిగా లారెన్స్… రిస్క్ అవుతుందా

డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, దర్శకుడు కం హీరోగా మారి, హారర్ కామెడీ అనే కొత్త జానర్ సృష్టించి,…

20 minutes ago

హీరోయిన్ రాధను సొంత అక్కే 46 కోట్లు మోసం చేసిందా?

ఆర్థిక వ్యవహారాలు రక్త సంబంధీకులు, తోడబుట్టిన వాళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టే ఉదంతాలు ఎన్నో చూస్తుంటాం. సెలబ్రెటీల్లో కూడా…

2 hours ago

దిల్ రాజు ద‌గ్గ‌ర ఆ డ‌బ్బులు తీసుకోని ప‌వ‌న్‌

సామాన్య జ‌నాల్లోనే కాదు.. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల్లోనూ పెద్ద సంఖ్య‌లో వీరాభిమానుల‌ను సంపాదించుకున్న హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాము…

5 hours ago

క్లారిటీ ఇవ్వాలంటోన్న సేన‌.. వెయిట్ అంటోన్న సేనాని..!

ఏపీలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించిన ఓట‌ర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..…

5 hours ago

ఔరా అవినాష్‌… పోలీసుల‌తో చెల‌గాట‌మా?!

మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, ప్ర‌స్తుత వైసీపీ నేత‌, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ పోలీసుల‌తో…

6 hours ago

రాకా రికార్డులు అప్పుడే మొదలైపోయాయి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో తెరకెక్కుతున్న రాకా విడుదల చాలా దూరంలో ఉండగానే రికార్డుల వేట…

7 hours ago