తొలి సినిమా ఫ్లాప్ అయితే.. హీరోయిన్లకు తర్వాత అవకాశాలు దక్కడం కష్టమే. కానీ కొందరు మాత్రం ఇందుకు మినహాయింపుగా నిలుస్తుంటారు. తెలుగులో వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలు చేసిన పూజా హెగ్డే.. తర్వాత ఎంత పెద్ద రేంజికి వెళ్లిందో తెలిసిందే. ముకుంద, ఒక లైలా చిత్రాలు ఫ్లాప్ అయ్యాక రెండేళ్లు అసలకిక్కడ ఆమె సినిమాలే చేయలేదు. కానీ తర్వాత ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి పెద్ద సినిమాలో అవకాశం అందుకుంది. ఆ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది.
కానీ ఈ చిత్రంలో పూజా గ్లామర్‌తో యూత్‌ను కట్టి పడేసింది. ఆమెను చాలా ఆకర్షణీయంగా చూపించిన దర్శకుడు హరీష్ శంకర్.. తన కెరీర్‌కు రెడ్ కార్పెట్ పరిచేశాడు. వరుసగా పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుని టాప్ రేంజికి వెళ్లిపోయింది పూజా. ఇప్పుడు హరీష్ డైరెక్ట్ చేసిన డిజాస్టర్ మూవీలో హీరోయిన్‌గా నటించిన అమ్మాయి ఇలాగే కెరీర్లో పైపైకి వెళ్లిపోతోంది. ఆమే.. భాగ్యశ్రీ బోర్సే.
గత ఏడాది రవితేజ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన ‘మిస్టర్ బచ్చన్’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. కానీ ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే మాత్రం సూపర్ సెక్సీగా కనిపించి కుర్రాళ్ల గుండెల్లో చోటు సంపాదించింది. దీంతో తొలి చిత్రం ఫలితంతో సంబంధం లేకుండా ఆమెకు అవకాశాలు దక్కుతున్నాయి. విజయ్ దేవరకొండ సరసన ‘కింగ్‌డమ్’ లాంటి క్రేజీ చిత్రంలో.. రామ్ సరసన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’లో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు భాగ్యశ్రీ ఖాతాలోకి మరో క్రేజీ ప్రాజెక్టు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. నేచురల్ స్టార్ నానితో ‘దసరా’ తర్వాత శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం హీరోయిన్‌గా కొన్ని పేర్లు ప్రస్తావించారు. ఇప్పుడు భాగ్యశ్రీ రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆమె ఖాతాలో పడితే కెరీర్ ఇంకో లెవెల్‌కు వెళ్లడం ఖాయం.
This post was last modified on July 14, 2025 3:58 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…