కోట శ్రీనివాసరావు ఎంత గొప్ప నటుడో తెలుగు వాళ్లకు తెలియంది కాదు. వాళ్లకు కొత్తగా ఈ విషయం గుర్తు చేయాల్సిన పని లేదు. తెలుగు సినిమాల్లో ఆయన అద్భుత నటనకు తార్కాణంగా నిలిచే పాత్రలు కోకొల్లలు. ఐతే మన వాళ్ల ప్రతిభను మనం పొగుడుకుంటే గొప్పేముంది? ఇతర భాషల వాళ్లు కొనియాడితే అది చాలా స్పెషల్. అందులోనూ తామే గొప్ప అనుకునే తమిళులు.. మన నటుడి ప్రత్యేకతను గుర్తించి ప్రశంసలు కురిపిస్తే అది మనకూ గర్వకారణమే. కోట శ్రీనివాసరావు ఈ గౌరవాన్నే పొందారు. తమిళంలో ఆయన 20 సినిమాలకు పైగానే నటించారు. పరభాషా నటులకు పెద్దగా అవకాశాలు ఇవ్వని తమిళ ఫిలిం ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేయడం అంటే చిన్న విషయం కాదు.
కోట ప్రతిభకు తమిళ ఫిలిం మేకర్స్, ప్రేక్షకులు అంతగా ఫిదా అయ్యారు కాబట్టే ఆయనకు అక్కడ అన్ని అవకాశాలు దక్కాయి. ఆయన ప్రతిభను తమిళులకు పరిచయం చేసిన సినిమా.. సామి. తెలుగులోకి ‘లక్ష్మీ నరసింహ’ పేరుతో రీమేక్ అయిన చిత్రమే.. సామి. ఇక్కడ బాలయ్య హీరోగా నటిస్తే ప్రకాష్ రాజ్ విలన్ పాత్ర పోషించారు. ఒరిజినల్లో లీడ్ రోల్‌లో విక్రమ్ నటిస్తే.. విలన్ పాత్రను కోట చేశారు. తమిళంలో ‘నరసింహ’ పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ అయిన సినిమా.. సామి. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావడంలో హీరోగా విక్రమ్ పెర్ఫామెన్స్ ఎంత కీలకమో.. కోట విలనీది కూడా అంతే ముఖ్య పాత్ర.
పెరుమాళ్ పిచ్చాయ్ అనే విలక్షణ పాత్రలో కోట అద్భుతంగా నటించాడు. తమిళంలో ఒక మూసలో సాగిపోతున్న విలన్ పాత్రలకు, నటనకు ఒక వైవిధ్యం తీసుకొచ్చారు కోట. ఆయన పెర్ఫామెన్సుకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సినిమాకు కోటకు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గాత్రదానం చేశారు. ఈ సినిమా తర్వాత తమిళంలో ఆయనకు అవకాశాలు వరుస కట్టాయి. విజయ్‌తో ‘తిరుపాచ్చి’, విశాల్‌తో ‘సెల్యూట్’, జీవాతో ‘కో’ (తెలుగులో రంగం), కార్తితో ‘శకుని’, విక్రమ్‌తో మరోసారి ‘తాండవం’, ‘సామి-2’.. ఇలా చాలా సినిమాలే చేశారాయన. ఆయా సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. కోట నటనకు మాత్రం ప్రతిసారీ ప్రశంసలు దక్కాయి. తమిళంలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు నటుల్లో కోట పేరు ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు.
This post was last modified on July 13, 2025 2:14 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…