ఒకప్పుడు ఐటెం సాంగ్స్ కంపోజ్ చేయాలంటే దేవిశ్రీ ప్రసాద్ తర్వాతే ఎవరైనా అన్నట్లుండేది. కానీ ఇప్పుడంతా అనిరుధ్ రవిచందర్‌దే హవా. అతను మంచి ఊపున్న పాట కంపోజ్ చేసి వదిలాడంటే సోషల్ మీడియా షేక్ అయిపోవాల్సిందే. అతడి ఐటెం సాంగ్స్‌లో జైలర్ కోసం చేసిన కావాలయ్యా పాట టాప్ అని చెప్పొచ్చు. ఆ పాట ఊపే వేరు. తమన్నా ఆ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేయడం.. చిత్రీకరణ కూడా వేరే లెవెల్లో ఉండడంతో అది సోషల్ మీడియాలో మామూలుగా వైరల్ కాలేదు. రీల్స్, షార్ట్స్‌లో ఆ పాటకు వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు.
దీన్ని కొట్టే పాట ఇంకోటి రాదని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అనిరుధే కంపోజ్ చేసిన మోనికా సాంగ్ దాన్ని మించిపోయేలా కనిపిస్తోంది. కూలీ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌గా రిలీజ్ చేసిన ఈ సాంగ్ 24 గంటలు తిరిగేసరికే సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. ట్యూన్ మంచి ఊపుతో సాగడం.. అనిరుధ్, సుభాషిణి కలిసి హుషారుగా పాడడం.. అన్నింటికీ మించి పూజాహెగ్డే సూపర్ సెక్సీ అప్పీయరెన్స్.. మంచి జోష్‌తో సాగిన స్టెప్పులు.. ఇలా అన్నీ ప్లస్ అయి పాట ఇన్‌స్టంట్‌గా హిట్ అయిపోయింది. అప్పుడే దీని మీద బోలెడన్ని ఎడిట్లు వచ్చేశాయి సోషల్ మీడియాలో. రీల్స్, షార్ట్స్‌లో కూడా ఈ పాట ట్రెండ్ అవడం మొదలైంది. యూట్యూబ్‌లో వ్యూస్, లైక్స్ మోతెక్కిపోతున్నాయి.
పూజా ఇంత హాట్‌గా కనిపించిన పాటలు అరుదు కావడంతో ఆమె గ్లామర్ ఫ్యాన్స్ వెర్రెత్తిపోతున్నారు. కావాలయ్యా పాటను ఇది కచ్చితంగా అధిగమించేలాగే కనిపిస్తోంది. ఇంకా రిలీజ్‌కు నెలకు పైగా సమయం ఉంది. ఈ లోపు మోనికా పాట ఎక్కడికో వెళ్లిపోయేలా కనిపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. రేప్పొద్దున థియేటర్లలో ఈ పాటకు రెస్పాన్స్ ఏ లెవెల్లో ఉంటుందో అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు. సినిమాకు ఈ సాంగ్ మేజర్ హైలైట్ అవడం ఖాయం. కూలీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 13, 2025 10:44 am
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…