టాలీవుడ్ కు ఇదో చీకటి రోజు. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్ను మూశారు. 750కి పైగా సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించి శాశ్వత విశ్రాంతి కోసం స్వర్గానికి వెళ్లిపోయారు. 83 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన అందుకోని మైలురాళ్లు లేవు. 1942 జూలై 10 జన్మించిన కోట స్వస్థలం కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామం. 1978లో చిరంజీవితో పాటు ప్రాణం ఖరీదుతో తెరంగేట్రం చేశారు. చిన్నప్పటి నుంచే నాటకాల మీద విపరీతమైన మక్కువ చూపించిన కోట తాను గొప్ప యాక్టరవుతానని ఏనాడూ అనుకోలేదు. తొలి చిత్రం తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కొన్నేళ్లు బ్యాంకు ఉద్యోగంలో కొనసాగారు.
1985లో దర్శకులు టి కృష్ణ నుంచి పిలుపు రావడం ఆయన కెరీర్ లో మేలి మలుపు. వందేమాతరంలో వేసింది చిన్న వేషమే అయినా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత కొద్దిరోజులకే ఉషాకిరణ్ మూవీస్ ప్రతిఘటనలో చేసిన కాశయ్య క్యారెక్టర్ ఒకేసారి పది మెట్లు పైకి ఎక్కించేసింది. వరస ఆఫర్లు రావడంతో హైదరాబాద్ నారాయణగూడలో చేస్తున్న బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి మదరాసు వచ్చేశారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. అహ నా పెళ్ళంట, యముడికి మొగుడు, శత్రువు, బావ బావమరిది, మామగారు, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, ఆమె లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో కీలక భూమికలు పోషించారు.
కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్ర ఇచ్చినా తనకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో మెప్పించడం కోటకే చెల్లింది. హలో బ్రదర్ లో హాస్యంతో నవ్వించే పోలీస్ గా, గణేష్ లో ప్రాణాలు తీసే క్రూరమైన మినిస్టర్ గా ఒకేసారి ప్రశంసలు అందుకోవడం కోటకు మాత్రమే సాధ్యం. అయిదుసార్లు నంది అవార్డు దక్కించుకున్న కోట శ్రీనివాసరావుకు 2015లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందజేసింది. 1999లో విజయవాడ తూర్పు బీజీపీ ఎంఎల్ఏగా కోట రాజకీయాల్లోనూ సేవలు అందించారు. మూడు తరాల నటులతో కలిసి పని చేసిన సమున్నత నట శిఖరం కోట శ్రీనివాసరావు లేకపోవడం పరిశ్రమకు తీరని లోటు.
This post was last modified on July 13, 2025 9:42 am
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…