ముద్దు సీన్లు చేయమంటే అభ్యంతరం వ్యక్తం చేసే హీరోయిన్లు ఉంటారు. కొందరు అలాంటి సీన్లు చూడడానికీ ఇబ్బంది పడతారు. కానీ ఇప్పుడో హీరోయిన్ ఓ సినిమాలో లిప్ లాక్ సీన్‌ను సెన్సార్ బోర్డు తీసేయడం మీద మండిపడుతోంది. ఆమే.. శ్రేయా ధన్వంతరి. ఈమె తెలుగమ్మాయే అనే సంగతి చాలామందికి తెలియదు. ఆమె పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. తెలుగులో ‘స్నేహగీతం’ అనే చిత్రంలోనూ నటించిన శ్రేయా.. తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ పలు చిత్రాల్లో నటించింది. కానీ ‘స్కామ్ 1992’తో తనకు వచ్చిన గుర్తింపే వేరు.
బోల్డ్ ఫొటో షూట్లతో సోషల్ మీడియాలో కుర్రాళ్లకు కనువిందు చేసే శ్రేయా.. హాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సూపర్ మ్యాన్’ సినిమా విషయంలో సెన్సార్ బోర్డు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. ఈ సినిమాలో 33 సెకన్ల పాటు నడిచే ఒక ముద్దు సన్నివేశం ఉంది. సూపర్ మ్యాన్, హీరోయిన్ మధ్య వచ్చే లిప్ లాక్ సీన్ అది. దీని లెంగ్త్ ఎక్కువ ఉందని సెన్సార్ బోర్డు వాళ్లు కత్తెర వేశారు. దీనిపై శ్రేయా మండి పడింది.
‘‘సూపర్ మ్యాన్ సినిమాలో 33 సెకన్ల లిప్ లాక్ సీన్‌ను సెన్సార్ బోర్డు తీసేసింది. ఇదేం చర్య? మనం థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని సెన్సార్ వాళ్లు కోరుకుంటారు. పైరసీలను ప్రోత్సహించకూడదని అంటారు. వాళ్ల ఉద్దేశమేంటో మాత్రం నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి చర్యలతో థియేటర్ అనుభూతిని ఎందుకు దెబ్బ తీస్తున్నారు? మా డబ్బు, టైం పెట్టి మేం ఏం చూడాలనుకుంటున్నామో మమ్మల్నే నిర్ణయించుకోనివ్వండి. ఇదొక అర్థరహితమైన విషయం. ప్రేక్షకులను చిన్నపిల్లల్లా భావించి థియేటర్ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించకుండా చేస్తున్నారు’’ అని ఆమె ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఐతే ‘సూపర్ మ్యాన్’ను ఎక్కువగా పిల్లలే చూస్తారన్న ఉద్దేశంతో సెన్సార్ వాళ్లు ఆ సన్నివేశాన్ని తీసేసి ఉండొచ్చని.. అందులో తప్పేముందని నెటిజన్లు శ్రేయాకు కౌంటర్ ఇస్తున్నారు.
This post was last modified on July 12, 2025 3:00 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…