సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం ‘కూలీ’ ఆరంభమైన దగ్గర్నుంచే బంపర్ క్రేజ్ తెచ్చుకుంది. సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్దీ హైప్ ఇంకా ఇంకా పెరుగుతోంది. ఓవైపు రజినీకాంత్.. ఇంకోవైపు అక్కినేని నాగార్జున.. మరోవైపు ఉపేంద్ర.. ఇలాంటి కాస్టింగ్‌తో సినిమా రావడం అరుదు. వారి వారి అభిమానులు ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే వీరిలా పెద్ద స్టార్ కాకపోయినా.. పెర్ఫామెన్స్‌లో ఆ ముగ్గురినీ డామినేట్ చేయగల నటుడు ఒకరు ఈ సినిమాలో ఉన్నాడు. అతనే.. సౌబిన్ షాహిర్.
ఇప్పుడు అందరూ రజినీ, నాగ్, ఉపేంద్రల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ.. ‘కూలీ’ రిలీజ్ తర్వాత సౌబిన్ షాహిర్ గురించే ఎక్కువగా చర్చించుకుంటే ఆశ్చర్యమేమీ లేదు. అతను అలాంటి పెర్ఫామర్ మరి. తన టాలెంట్ ఏంటో అతను ఇంతకుముందు నటించిన కొన్ని చిత్రాలను ఓసారి పరిశీలిస్తే అర్థమవుతుంది. కుంబలంగి నైట్స్, ఆండ్రాయిడ్ కుంజప్పన్, ఎళ వీళ పూంచిర, మంజుమ్మల్ బాయ్స్ లాంటి సినిమాలు చూసిన వాళ్లు సౌబిన్ నటనను అంత సులువుగా మరిచిపోలేరు. ముఖ్యంగా కుంబలంగి నైట్స్, ఎళ వీళ పూంచిర లాంటి సినిమాల్లో సౌబిన్ పెర్ఫామెన్స్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.
మన కలర్స్ స్వాతి ‘కుంబలంగి నైట్స్’లో ఒక సింపుల్ సీన్లో సౌబిన్ నటన గురించి అబ్బురపడుతూ ఒక వీడియో కూడా చేసింది. ఎక్కువ హడావుడి చేయకుండా సటిల్‌గా నటిస్తూ ప్రేక్షకులను కట్టి పడేస్తాడు సౌబిన్. ఫాహద్ ఫాజిల్ తర్వాత కొత్తతరం నటుల్లో అంత గుర్తింపు సంపాదించాడు సౌబిన్. లుక్స్ పరంగా యావరేజ్ అనిపిస్తాడు కానీ.. నటనలో మాత్రం అతడికి తిరుగులేదు. అతణ్ని ఏరి కోరి ‘కూలీ’ కోసం ఎంచుకున్న లోకేష్ కనకరాజ్.. తన టాలెంట్‌కు తగ్గ పవర్ ఫుల్ క్యారెక్టరే ఇచ్చి ఉంటాడని భావిస్తున్నారు. తొలిసారి ఇలాంటి భారీ కమర్షియల్ ఎంటర్టైనర్‌లో నటించిన సౌబిన్.. అందులో ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి. ‘కూలీ’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 12, 2025 2:37 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…