రాజమౌళి విజువల్ గ్రాండియర్లు, కమర్షియల్ సినిమాలు కాసేపు పక్కనపెడితే తక్కువ బడ్జెట్ తో ఆయన తీసిన బ్లాక్ బస్టర్ మర్యాదరామన్నకు అభిమానుల మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది. కమెడియన్ సునీల్ ని హీరోగా పెట్టి అంత పెద్ద హిట్టు కొట్టడమనేది ఎవరూ ఊహించనిది. స్టార్లు వెంటపడుతున్న టైంలో వాళ్ళను కాదని ఒక హాస్యనటుడితో విజయం సాధించడమనేది జక్కన్నకు మాత్రమే సాధ్యమైన ఫీట్. కొన్నేళ్ల పాటు సునీల్ ని మోస్ట్ బిజీ హీరోగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. మర్యాదరామన్న పలు భాషల్లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే..
హిందీలో అజయ్ దేవగన్ తో మర్యాద రామన్నని సన్నాఫ్ సర్దార్ గ రీమేక్ చేశారు. నార్త్ లోనూ అదిరిపోయే హిట్టు అనుకుంది. ఇదంతా 2012 నాటి ముచ్చట. పదమూడు సంవత్సరాలు గడిచిపోయాయి. దానికి కొనసాగింపు తెలుగులో చేయలేదు కానీ బాలీవుడ్ లో జరిగిపోయింది. సన్నాఫ్ సర్దార్ 2 వచ్చే వారం జూలై 25 విడుదలకు రెడీ అయిపోయింది. పంజాబ్ ఫ్యాక్షనిస్టుల కుటుంబం నుంచి తప్పించుకున్న సర్దార్ ఇప్పుడు స్కాట్ ల్యాండ్ వెళ్లి అక్కడ ఇంకో ఫ్యామిలీలో చిక్కుకుంటాడు. ఊహించని విధంగా ఆర్మీ ఆఫీసర్ అవతారం ఎత్తుతాడు. ఈసారి రెండో భాగానికి దర్శకుడు మారాడు.
ఇప్పుడీ సన్నాఫ్ సర్దార్ 2లో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటించింది. హరిహర వీరమల్లుకి కేవలం ఒక్క రోజు గ్యాప్ తో రిలీజవుతున్న ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ కు ఎలాంటి పోటీ ఎదురు కానుందో చూడాలి. అయినా మన దగ్గర సాధ్యం కాని మర్యాదరామన్న సీక్వెల్ ఐడియా హిందీలో వర్కౌట్ కావడం విశేషమే. చాలా గ్యాప్ తర్వాత అజయ్ దేవగన్ ఫుల్ లెన్త్ కామెడీ వేషం వేశాడు. ట్రైలర్ చూస్తుంటే జోకులు బాగానే దట్టించారు. అయితే కాన్సెప్ట్ కొంచెం అవుట్ డేటెడ్ గానే అనిపిస్తోంది. మళ్ళీ అదే తరహా హాస్యంతో నవ్వించడం కష్టమే. హౌస్ ఫుల్ 5 లాగా ఏదోలా బండి లాగిస్తుందేమో చూడాలి.
This post was last modified on July 11, 2025 2:28 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…