బిగ్‍బాస్ హౌస్ నుంచి టిక్‍టాక్ స్టార్ మెహబూబ్ ఎలిమినేట్ అయిపోయాడు. టాస్కులు బ్రహ్మాండంగా ఆడేస్తే ప్రేక్షకులు తనకు ఓట్లు వేస్తారని మెహబూబ్ బలంగా నమ్మాడు. అందుకే తనను తాను స్ట్రాంగ్ అని చెప్పుకునేవాడు. అతడు పెట్టే ఎఫర్టస్కి మెహబూబ్ కచ్చితంగా టాప్ 5లో వుంటాడని హౌస్‍మేట్స్ కూడా భావించారు. కానీ అరియానా, మోనల్, హారిక లాంటి వాళ్లు సేవ్ అయి పదవ వారంలో మెహబూబ్ ఎలిమినేట్ అవడంతో అంతా షాకయ్యారు.
మెహబూబ్ అయితే అసలు నమ్మలేక తన దురదృష్టాన్ని నిందించాడు. నిజానికి బిగ్‍బాస్ కావాలని పొడిగించి వుండకపోతే మెహబూబ్ అయిదు వారాలలోనే ఎలిమినేట్ అయి వుండేవాడు. మెహబూబ్ ఎలిమినేట్ అవడంతో హౌస్‍లో మిగిలిన వారికి ఏమి చేస్తే ఆడియన్స్ ఆదరణ దక్కుతుందనే దానిపై క్లారిటీ పూర్తిగా పోయింది. అసలు ఆడియన్స్ ఏమి చూసి ఓట్లేస్తున్నారు? టాస్కులు ఆడినా లేకపోయినా మిగతా టైమ్‍లో డ్రామా నడిపే వారికే ఎక్కువ ఫుటేజ్ దక్కుతుంది.
మెహబూబ్ టాస్కులలో తప్ప మామూలుగా ఎక్కడున్నాడనేది కనిపించేది కాదు. అమ్మాయిలతో పరాచికాలు ఆడుతూ… నిజంగా వాళ్లపై ఫీలింగ్స్ వున్నా లేకపోయినా కెమెరాల కోసం నటించాలి. ఈ సంగతి మొదట్నుంచీ అమల్లో పెట్టిన వారిలో చాలా మంది ఇంకా హౌస్‍లో మిగిలి వున్నారు. లాస్య, సోహైల్ మాత్రమే అలాంటి వాటి జోలికి పోలేదింకా. కాకపోతే సోహైల్ ఆవేశం అతడికి గుర్తింపు తెచ్చి ఇక్కడి వరకు తీసుకొచ్చింది.
ఫుటేజీ స్టార్లతో మిగతా వాళ్లు కూడా పోటీ పడక తప్పని పరిస్థితిలో ఇప్పుడెవరు చివరి వారం వరకు మిగుల్తారనేది ఆసక్తికరమైన అంశం. ఇదిలావుంటే ఎలిమినేట్ అయిన వారిలో ఒకరితో రీఎంట్రీ ఇప్పించి బయట ఏమి జరుగుతుందనేది లోపలి వారికి తెలిసేట్టు చేయడానికి ప్రణాళిక రచించారని సమాచారం.
This post was last modified on November 16, 2020 4:38 pm
భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…
భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జరిగిన…
పిఠాపురంలోని చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయ కేతనం సభకు…
ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్.. 60వ ఏట అడుగు పెడుతున్న…
జనసేన ఆవిర్భావ సభ జయకేతనం వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణ వినిపించింది. మొన్నటిదాకా…
జనసేన ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ శ్రేణుల్లో ఏ మేర జోష్ ను నింపాయన్నది.. పిఠాపురం శివారు చిత్రాడలో జయకేతనం…