బాహుబలి టెన్త్ యానివర్సరిని పురస్కరించుకుని ఇవాళ రీ రిలీజ్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అయితే రెండు భాగాలను కలిపి ది ఎపిక్ పేరుతో విడుదల చేయనుండటం అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తోంది. ఆరు గంటలకు దగ్గరగా ఉన్న కంటెంట్ ని మూడు గంటలకు కుదించడం అనేది పెద్ద సవాల్. పైగా బాహుబలి ది బిగినింగ్, ది కంక్లూజన్ లో అవసరం లేని ఎపిసోడ్లు, అక్కర్లేని పాటలు పెద్దగా ఉండవు. ఒకవేళ రెండు మూడు అనిపించినా మహా అయితే వాటి నిడివి అరగంటలోపే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు సగానికి పైగా లెన్త్ కి కోత వేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడమంటే ఆషామాషి కాదు.
రాజమౌళి ప్రస్తుతం ఈ స్పెషల్ వెర్షన్ కోసమే ఒక ఎడిటింగ్ టీమ్ ని పురమాయించారట. అవసరమైన సన్నివేశాలు తీసేయకుండా, అభిమానుల నుంచి కంప్లయింట్ రాకుండా కొత్త బాహుబలి చూస్తున్న ఫీలింగ్ కలిగేలా ఏమేం చేయాలో పూర్తి ఇన్ ఫుట్స్ ఇస్తూ, క్రమం తప్పకుండా ప్రోగ్రెస్ ని చెక్ చేసుకునే పనిలో ఉన్నారట. మహేష్ బాబు 29 షూటింగ్ కి బ్రేక్ దొరికినప్పుడంతా బాహుబలి ది ఎపిక్ పనులు చూసుకుంటున్నారని తెలిసింది. అక్టోబర్ 31 డేట్ ఇచ్చేశారు కాబట్టి సెప్టెంబర్ లోగా పని పూర్తి చేసుకుని, ఫైనల్ కాపీ చెక్ చేసుకుని సెన్సార్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇదంతా ఒక కొత్త సినిమా తీయడంతో సమానం.
ఒకవేళ బాహుబలి ది ఎపిక్ కనక బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయితే దీన్ని పెద్ద ఎత్తున వరల్డ్ మార్కెట్ లో రిలీజ్ చేసే ప్లానింగ్ ఉందట. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి సినిమాలకు జపాన్, చైనా లాంటి దేశాల్లో డిమాండ్ పెరిగింది. మన దగ్గర జరగలేదు కానీ అక్కడ ట్రిపులార్ డివిడిలు, బ్లూరే డిస్కులు విడుదల చేసేంత క్రేజ్ నెలకొంది. ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ కొత్తగా వాళ్ళను మెప్పిస్తే మళ్ళీ కనకవర్షం ఖాయం. ఇప్పుడీ సింగల్ పార్ట్ కోసం ప్రత్యేక మార్కెటింగ్ ప్లాన్ సిద్ధమవుతోందట. ప్రభాస్, అనుష్క, రానాతో పాటు మెయిన్ క్యాస్టింగ్ అందరితో ప్యాన్ ఇండియా ప్రమోషన్లు చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని టాక్.
This post was last modified on July 10, 2025 3:11 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…