దక్షిణాదిన ఒకప్పుడు టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా వైభవం చూశారు ఏఎం రత్నం. 90వ దశకంలో ఏఎం రత్నం ‘సూర్య మూవీస్’ నుంచి సినిమా అంటే ఒక రేంజ్ ఉండేది. శంకర్‌తో భారతీయుడు, ఒకే ఒక్కడు.. పవన్ కళ్యాణ్‌తో ఖుషి లాంటి సినిమాలు తీసి నిర్మాతగా తిరుగులేని స్థాయిని అందుకున్నాడాయన. కానీ తర్వాతి కాలంలో వరుస పరాజయాలు ఆయన్ని వెనక్కి లాగేశాయి. ప్రొడ్యూసర్‌గా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’తో పూర్వ వైభవం అందుకోవాలని చూస్తున్నారు రత్నం.
ఆయన్ని త్వరలోనే ఓ ప్రభుత్వ పదవిలో చూడబోతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రత్నంను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించనుందట. తెలంగాణలో ఈ పదవిలో అగ్ర నిర్మాత దిల్ రాజు ఉన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటిదాకా ఆ పదవిలో ఎవరినీ నియమించలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు రత్నం చాలా క్లోజ్ అన్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో ఖుషి, బంగారం సినిమాలు వచ్చాయి. నిర్మాతగా దెబ్బ తిన్న రత్నంకు ఇంకో సినిమా చేయాలని చాలా ఏళ్ల పాటు ప్రయత్నించి.. చివరికి ‘హరిహర వీరమల్లు’ను లైన్లో పెట్టాడు పవన్. కానీ ఆ సినిమా బాగా ఆలస్యమై రత్నం మీద మోయలేని భారం పడింది.
పవన్ పొలిటికల్ కమిట్మెంట్లను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా ఎంత ఆలస్యమైనా ఓపిగ్గా ఎదురు చూశారు రత్నం. ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లోనూ ఆయన భాగమయ్యారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రత్నంను ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించాలని పవన్ భావిస్తున్నారట. ఓ ఇంటర్వ్యూలో దీని గురించి అడిగితే.. ఆ దిశగా పవన్ ఆలోచిస్తున్నారని.. ఆయన అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేద్దామని అన్నారు రత్నం. ఇంకో నెలా రెండు నెలల్లో ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశముంది.
This post was last modified on July 10, 2025 12:41 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…