తెలంగాణ పల్లె పాటల్లో ఉండే ఊపే వేరు. రోజుల తరబడి మ్యూజిక్ సిట్టింగ్స్ వేసి.. రిహార్సల్స్ చేసి.. అధునాతన సంగీత పరికరాలు వాడి.. పేరు మోసిన గాయకులతో పాడించి క్రియేట్ చేసే సినిమా పాటలు వాటి ముందు దిగదుడుపు అనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. బుల్లెట్ బండి.. ఓ పిలగ వెంకటేశ.. లాంటి పాటలు యూట్యూబ్‌లో కోట్లకు కోట్లు వ్యూస్ తెచ్చుకుని జనబాహుళ్యంలో ఎంతగా ఆదరణ పొందాయో తెలిసిందే. ఈ కోవలో చెప్పుకోవడానికి పదుల సంఖ్యలో పాటలున్నాయి.
ఈ మధ్య కాలంలో ఈ పాటల్లో అతి పెద్ద సెన్సేషన్ అంటే.. రాను బొంబాయ్‌కి రాను. సింపుల్ ట్యూన్.. అంతే సింపుల్ కొరియోగ్రఫీ.. కానీ కావాల్సినంత ఊపు.. ఇంకేముంది ఈ పాట యూట్యూబ్‌లో మోత మోగించేసింది. విడుదలైన నాలుగు నెలల్లోనే ఈ పాటకు ఏకంగా 40 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఈ పాట ఎంత పాపులర్ అంటే.. హిందీ టీవీ షోల్లో సెలబ్రెటీలు సైతం దీనికి స్టెప్పులు వేశారు. దేశ విదేశాల్లో ఈ పాట తిరుగులేని పాపులారిటీ సంపాదించింది. నాలుగు నెలల్లో 40 కోట్ల వ్యూస్ అంటే చిన్న విషయం కాదు.
కేవలం ఈ వ్యూస్ ద్వారా యూట్యూబ్ నుంచి వచ్చిన ఆదాయం కోటి రూపాయలు కావడం విశేషం. ఇంత తక్కువ వ్యవధిలో ఈ స్థాయి రీచ్ సంపాదించిన ఈ పాట.. మున్ముందు ఇంకా ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం. దీని మీద ఆదాయం కొనసాగుతూనే ఉంటుంది. ఒక చిన్న పల్లె జానపదంతో కోట్ల రూపాయల ఆదాయాన్ని కొల్లగొడుతోంది దీని టీం. ‘రాను బొంబాయ్‌కి రాను’ పాటను కళ్యాణ్ కీస్ అనే సంగీత దర్శకుడు ట్యూన్ చేయగా.. రాము రాథోడ్ లిరిక్స్ రాశాడు. రాముతో కలిసి ప్రభ అనే సింగర్ ఈ పాటను పాడింది. ‘ఓ పిలగ..’ పాటను కూడా ప్రభనే పాడింది.
This post was last modified on July 10, 2025 12:38 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…