అదేంటి సిద్ధూ జొన్నలగడ్డ బ్యాడ్ యాస్ గురించి ఇవాళ విన్నాం కానీ ఈ బ్యాడ్ గర్ల్ ఎవరనుకుంటున్నారా. ఇది వేరే మ్యాటర్ లెండి. కోలీవుడ్ – బాలీవుడ్ కల్ట్ దర్శకులుగా పేరున్న వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నిర్మాతలుగా మారి తీసిన ఈ సినిమా టీజర్ వచ్చి ఏడాది దాటేసింది. అయితే కంటెంట్ వివాదాస్పదంగా ఉండటంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి. వర్షా భరత్ అనే మహిళా దర్శకురాలిని ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నారు. టైటిల్ రోల్ అంజలి శివరామన్ పోషించగా ఒకప్పటి హీరోయిన్ భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. దీని వెనుక ఇంత కథ ఉంది.
అప్పటి నుంచే ఈ బ్యాడ్ గర్ల్ సెన్సార్ చిక్కులో పడింది. ఒక కులాన్ని కించపరిచే విధంగా ఇందులో సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు అధికారులకు సైతం అదే అనిపించడంతో రిలీజ్ ఆగిపోయింది. ఎట్టకేలకు వాళ్ళు చెప్పిన కట్స్, మార్పులకు ప్రొడ్యూసర్లు ఒప్పుకోవడంతో రూట్ క్లియర్ అయ్యింది. సెప్టెంబర్ 5 బ్యాడ్ గర్ల్ తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళంలో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. విపరీతమైన కట్టుబాట్లు ఉండే కుటుంబంలో పుట్టి పెరిగిన ఒక అమ్మాయి ప్రేమ, వైవాహిక జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.
చెన్నై టాక్ ప్రకారం ఎన్ని కత్తిరింపులు చేసినా బ్యాడ్ గర్ల్ విడుదల తర్వాత కాంట్రావర్సిలు తలెత్తుతాయట. మొన్న ఫిబ్రవరి నెలలో రోస్టర్ డామ్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రదర్శిస్తే అక్కడ ప్రశంసలు అందుకుంది. అయితే సంప్రదాయాల్లో తప్పులను ఎత్తి చూపించే ఇలాంటి కంటెంట్ ని మన ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. వాయిదా పడినప్పటి నుంచి పలు సందర్భాల్లో వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ ఇద్దరూ సెన్సార్ పోకడల మీద అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఏదైతేనేం పరిష్కారం దొరికింది. ముందు ఆగస్ట్ రిలీజ్ అనుకున్నారు కానీ కూలి, వార్ 2 దెబ్బకు ఇంకో నెల ఆలస్యంగా వస్తున్నారు.
This post was last modified on July 9, 2025 5:20 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…