ఇప్పుడు జరుగుతున్నది బాగుంది కదా, టెన్షన్ ఎందుకనే ధోరణి పరిశ్రమలో బాగా పెరిగిపోయింది. దీని వల్ల క్వాలిటీ తగ్గిపోయి, ప్యాన్ ఇండియా మోజులో పడి విలువైన టైంని వృథా చేసుకోవడంతో పాటు దారుణమైన డిజాస్టర్లు చవి చూస్తున్న హీరోలు అంతకంతా పెరుగుతూ పోతున్నారు. దీనికి చిన్నా పెద్దా తేడా లేదు. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు ఈ విషయంగా చెబుతున్న కొన్ని కఠిన వాస్తవాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. బాలీవుడ్ పతనాన్ని చూసి మనం జాగ్రత్త పడటం లేదని, మార్కెట్ కిందకు వెళ్లిపోవడాన్ని గుర్తించకపోతే భవిష్యత్ పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే సూచన ఒక ఇంటర్వ్యూలో చేశారు.
ఆయన చెప్పింది అక్షరాలా నిజం. ఎందుకంటే ఇదే దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం రూపంలో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సాధించారు. కానీ కేవలం ఆరు నెలల కాలంలో గేమ్ ఛేంజర్, తమ్ముడు రూపంలో తీవ్ర నష్టాలు తెచ్చిన సినిమాలు ఇచ్చారు. విక్రమ్ తో కమల్ హాసన్ కంబ్యాక్ అయ్యారు, ఇక తిరుగు లేదని భావించిన వారు ఇండియన్ 2, థగ్ లైఫ్ ఫలితాలు చూశాక మాట్లాడలేదు. కూలీ క్రేజ్ రజనీకాంత్ వల్ల వచ్చిందనుకుంటే మరి లాల్ సలామ్ కు కనీస ఓపెనింగ్స్ ఎందుకు రాలేదు. మెగా 157ని ఎగబడి కొనేందుకు నెలకొన్న ఓటిటి పోటీ విశ్వంభరకు కనిపించలేదు. ఇలా చెప్పుకుంటూ బోలెడు ఉదాహరణలు ప్రత్యక్ష సాక్షాలుగా నిలుస్తాయి.
బాలీవుడ్ ఒకప్పుడు గోల్డెన్ ఎరా చూసింది. మాస్, క్లాసు మెచ్చుకునే ఎన్నో గొప్ప క్లాసిక్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏడాది అయిదారు బ్లాక్ బస్టర్స్ ఇవ్వడమే గగనమైపోయింది. హారర్ జానర్ మీద మితిమీరి ఆధారపడుతూ కామన్ ఆడియన్స్ ని పట్టించుకోవడం మానేశారు. దీని వల్ల కింది సెంటర్ల థియేటర్లలో జనాలు కనిపించడం తగ్గిపోయింది. మల్టీప్లెక్సులను నమ్ముకున్న నిర్మాతలు అన్నివేళలా పాజిటివ్ రిజల్ట్స్ అందుకోవడం లేదు. మనకూ అలాంటి స్థితి రాకూడదంటే కంటెంట్, క్వాలిటీ, బడ్జెట్ ఈ మూడు అంశాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే దిల్ రాజు అన్నట్టు ఒకప్పుడు రోజులే బాగుండేవనే పరిస్థితి తలెత్తుతుంది.
This post was last modified on July 9, 2025 11:38 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…