సినీ పరిశ్రమలో వారసత్వం చర్చ ఇప్పటిది కాదు. స్టార్ కుటుంబాల నుంచి వచ్చిన హీరోలను బలవంతంగా ప్రేక్షకుల మీదకు రుద్డుత్తున్నారనే చర్చ సంవత్సరాలుగా జరుగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ గోల ఎక్కువగా ఉంటుంది. నిర్మాత కరణ్ జోహార్ ఈ విషయంగా చాలా విమర్శలు ఎదురుకున్నాడు. అయినా టాలెంట్ లేనిదే ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా నిలదొక్కుకోవడం కష్టం. ఎస్వి రంగారావు మనవడు హీరో కావడానికి ట్రై చేసినా పనవ్వలేదు. స్వర్గీయ ఎన్టీఆర్ పిల్లల్లో అందరూ బాలకృష్ణ లాగా స్టార్ హీరో స్థాయికి చేరుకోలేదు. నాగార్జున వారసుల్లో నాగచైతన్య సెటిల్ కాగా అఖిల్ ఇంకా మొదటి బ్లాక్ బస్టర్ కోసం పోరాడుతున్నాడు.
మాములుగా ఈ టాపిక్ గురించి మన హీరోలు ఓపెన్ స్టేజి మీద మాట్లాడ్డం అరుదు. ఇవాళ జరిగిన సుహాస్ ఓ భామ అయ్యో రామా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచు మనోజ్ మాట్లాడుతూ బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే ఇండస్ట్రీలో నెగ్గుకొస్తారనే మాట నిజం కాదని, ఆ మాటకొస్తే ఆ పప్పులేం ఉడకవని, నెపో కిడ్స్ అయినా దేకాల్సిందే అంటూ తననే ఉదాహరణగా చెప్పుకున్నారు. నిజమేగా. మోహన్ బాబు లాంటి పవర్ ఫుల్ నేపథ్యం ఉన్నప్పటికీ మంచు మనోజ్ పూర్తి స్థాయిలో సెటిల్ కాలేకపోయాడు. హీరోగా వరస సక్సెస్ లు చూడలేకపోయాడు. ఇటీవలే భైరవంలో విలన్ గా రీ ఎంట్రీ ఇస్తే అది కూడా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.
ఇంకో కోణంలో చూస్తే చిరంజీవి, రవితేజ, నాని ఇలా ఎందరో హీరోలు సపోర్ట్ లేకుండానే పెద్ద మార్కెట్, ఇమేజ్ సృష్టించుకున్నవాళ్ళు. సుహాస్ కూడా ఇదే క్యాటగిరి కానీ ఇంకా వీళ్ళ సరసన చేరుకోలేదు. మనోజ్ చెప్పిన నెపో కిడ్స్ కామెంట్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. తనకు బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టే కొన్ని స్క్రిప్టులు నో చెప్పలేకపోయానని విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో చెప్పి కొద్దిగంటలు కాక ముందే మంచు మనోజ్ ఇలా చెప్పడం ట్విస్ట్. జూలై 11 విడుదల కాబోతున్న ఓ భామ అయ్యో రామా మీద సుహాస్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అనుష్క ఘాటీ తప్పుకోవడం కలిసి వచ్చేలా ఉంది.
This post was last modified on July 8, 2025 10:03 pm
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…