పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో మరే సినిమాకూ ఎదురు కాని ఇబ్బందులు ‘హరిహర వీరమల్లు’కు ఎదురయ్యాయి. ఈ సినిమా ఏకంగా ఆరేళ్లు మేకింగ్ దశలో ఉంది. సినిమాను పూర్తి చేయడంలో తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. దర్శకుడు మారాడు. బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది. మొదట్లో ఉన్న హైప్ తర్వాత తగ్గిపోయింది. మరోవైపు రిలీజ్ డేట్ పలుమార్లు మార్చాల్సి వచ్చింది. బిజినెస్ పరంగా కూడా ఇబ్బందులు తప్పలేదు.
అన్నింటినీ తట్టుకుని నిలబడ్డ నిర్మాత ఏఎం రత్నం ఈ నెల 24న సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈసారి పక్కాగా సినిమా విడుదల అవుతుందనే భావిస్తున్నారు. బిజినెస్ కూడా ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఐతే ఈ చిత్రం గురించి అదే పనిగా వ్యతిరేక ప్రచారం చేయడం పట్ల రత్నం ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.
రిలీజ్ డేట్లు మార్చడం, వాయిదా వేయడం గురించి ఎగ్జాజరేట్ చేసి చూపించడం తనకు ఆవేదనకు, ఆగ్రహానికి గురి చేసినట్లు ఆయన చెప్పారు. ‘‘మా సినిమా 14 సార్లు వాయిదా పడ్డట్లు మీడియాలో ప్రచారం జరిగింది. ఆ వార్తలు నాకు బాధ, కోపం తెప్పించాయి. సినిమాకు అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించి వాయిదా వేసింది మూడుసార్లు మాత్రమే.
మార్చి 28కి ఫస్ట్ డేట్ ఇచ్చాం. తర్వాత మే 9న అని చెప్పాం. జూన్ 12కు ఇంకో డేట్ ఇచ్చాం. ఈ మూడుసార్లూ సినిమా వాయిదా పడింది. జూన్ 12న సినిమాను రిలీజ్ చేయలేకపోయినపుడు నేను కూడా చాలా ఫీలయ్యాను. నా కెరీర్లో ఇప్పటి వరకు ఏ సినిమా రిలీజ్ వాయిదా పడలేదు. వేరే నిర్మాతలు సినిమా మొదలైనపుడే రిలీజ్ డేట్ ఇస్తుంటారు. కానీ నేను మాత్రం సినిమా పూర్తయ్యాకే రిలీజ్ డేట్ చెబుతాను.
హరిహర వీరమల్లుకు గ్రాఫిక్ వర్క్ ఎక్కువ. వీఎఫెక్స్‌తో ముడిపడ్డ సినిమాలకు డేట్లు మారడం సహజం. బాహుబలి లాంటి పెద్ద సినిమాలకు కూడా ఇది జరిగింది. మా సినిమా కూడా గ్రాఫిక్ వర్క్ వల్లే ఆలస్యం అయింది. కానీ బిజినెస్ జరగక వాయిదా వేశామని వార్తలు వచ్చాయి. మా సినిమాల బడ్జెట్ ఎంత అన్నది మేం ఎప్పుడూ చెప్పలేదు. దీనికీ చెప్పను. ఇది పెద్ద సినిమా. ఎన్నో ఇబ్బందులను అధిగమించి రిలీజ్ చేస్తున్నాం. ట్రైలర్ చూశాక అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ స్థాయిని పెంచుతుంది’’ అని రత్నం అన్నారు.
This post was last modified on July 8, 2025 4:38 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…