Movie News

ఎల్లమ్మకు పోస్ట్ మార్టం తప్పదేమో

ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అనే పాట అప్పుడప్పుడు ఇండస్ట్రీ ట్రెండ్స్ కి సరిపోతుంది. ఎన్నో ఆశలతో ఇటీవలే విడుదలైన తమ్ముడు ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో టీమ్ తో పాటు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో ఫ్లాప్ అయినా కనీసం వీకెండ్ వసూళ్లతో కొంత ఊరటనిచ్చేది. కానీ తమ్ముడు టాక్ మరీ దారుణంగా వచ్చింది. ట్విట్టర్ హ్యాండిల్ లో కాసిన్ని ట్వీట్లు వేయడం తప్ప నిర్మాణ సంస్థ ప్రమోషన్లు ఆపేసింది. వీకెండ్ ప్రెస్ మీట్లు, బాణా సంచా కాల్చడాలు లాంటి వాటికి దూరంగా ఉంది. ఫలితాన్ని ఇంత త్వరగా అంగీకరించే నిర్మాణ సంస్థలు అరుదు.

సరే తమ్ముడు రిజల్ట్ తేలిపోయింది కాబట్టి ఇక్కడితో మర్చిపోదాం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇదే దిల్ రాజు బ్యానర్ లో నితిన్ నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ ఉంది. ఇంకా సెట్స్ కు వెళ్ళలేదు. స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని దర్శకుడు వేణు యెల్దండి రాజుగారి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది కూడా పెద్ద బడ్జెట్ డిమాండ్ చేస్తోంది. స్క్రిప్ట్ మీద ఎన్నో నెలల పని జరిగింది. నానినే ఇష్టపడ్డాడు కానీ వేరే కారణాల వల్ల వదులుకున్నాడు. చివరికి నితిన్ ని చేరింది. తమ్ముడు ఎలాగూ బ్రహ్మాండంగా ఆడేస్తుందనే నమ్మకంతో రాజుగారు ఎల్లమ్మకు అవసరమయ్యే ఖర్చు గురించి పెద్దగా ఆలోచించలేదు.

లేటెస్ట్ టాక్ ఏంటంటే ఎల్లమ్మకు పోస్ట్ మార్టం అవసరమవుతుందట. అంటే ఒకసారి స్క్రిప్ట్ మొత్తం అనాలిసిస్ చేసుకుని, ఖర్చు తగ్గించుకోవడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో వెతుక్కుని, ఓటిటి రేట్ సాధ్యాసాధ్యాలు విశ్లేషించుకుని రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారట. ముందు అనుకున్న ప్రకారమైతే జూన్ లోనే ఎల్లమ్మ షురూ కావాలి. కానీ ఆలస్యమయ్యింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించే అవకాశమున్న ఎల్లమ్మ కూడా బలగం తరహాలో విలేజ్ డ్రామానే. కాకపోతే పీరియాడిక్ సెటప్ ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది నితిన్ ను డూ ఆర్ డై సిచువేషన్ లాంటిది. రెండో ఆప్షన్ లేదు. గెలవాల్సిందే.

This post was last modified on July 7, 2025 2:27 pm

Share

Recent Posts

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

11 minutes ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

1 hour ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

13 hours ago