1991 సంవత్సరం మే 21 దేశం మొత్తం ఉలిక్కిపడింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని తమిళనాడు శ్రీ పెరంబదూర్ లో బాంబు దాడి చేసి చంపడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇండియాలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేతల్లో ఒకరైన పొలిటీషియన్ ని అంత తేలిగ్గా హత్య చేయడం చూసి జనాలు నివ్వెరపోయారు. పోలీసుల వైఫల్యాన్ని ఎండగడుతూ పత్రికల్లో వచ్చిన కథనాలు బోలెడు. ఈ ఉదంతం మీద చాలా పుస్తకాలు వచ్చాయి. జాన్ అబ్రహం హీరోగా ‘మద్రాస్ కేఫ్’ అనే సినిమా వచ్చింది. అందులో రాశి ఖన్నా నటించింది. అయితే అది పరిమిత నిడివితో రాజీవ్ హత్యకు ముందు జరిగిన ఘటనల ఆధారంగా తీసిన చిత్రం.
తాజాగా ‘ది హంట్ – ది రాజీవ్ గాంధీ అసాసినేషన్’ పేరుతో వెబ్ సిరీస్ వచ్చింది. ఎక్స్ పీఎం మర్డర్ జరిగిన వెంటనే సిబిఐ తరఫున కార్తికేయన్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒకటి విచారణ మొదలు పెడుతుంది. ఘటనా స్థలంలో దొరికిన ఒక కెమెరాతో తీసిన ఫోటల ఆధారంగా నేరం తాలూకు లోతుల్లోకి వెళ్తారు. అప్పుడే దీని వెనుక శ్రీలంకలో హక్కుల కోసం పోరాడుతున్న ఎల్టిటీఈ ఉందని తెలుస్తుంది. దీంతో తమిళనాడులో దాని సానుభూతిపరుల కోసం వేట ముమ్మరమవుతుంది. ఈ కుట్రకు రచన చేసిన శివరాసన్ బెంగళూరులో తల దాచుకుంటే అతన్ని ఎలా కనిపెట్టారనే దాని మీద ఏడు ఎపిసోడ్లు రూపొందించారు. తెలుగు ఆడియో ఉంది.
ది హంట్ దర్శకుడు నగేష్ కుకునూర్. హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్, బాలీవుడ్ కాలింగ్ లాంటి ఎన్నో విలక్షణమైన సినిమాలు తీసిన అనుభవముంది. అనిరుధ్య మిత్రా రాసిన 90 డేస్ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. క్లూస్ ని వెతికే తీరు, ఉగ్రవాదులను పట్టుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, ఆత్మహత్యకు సిద్ధపడిన వాళ్ళ వ్యూహాలను కనుక్కునే విధానం చాలా ఇంటరెస్టింగ్ గా తీశారు. కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ ఇలాంటి కంటెంట్స్ ని ఇష్టపడే వాళ్ళు ఏ మాత్రం నిరాశపరచకుండా ది హంట్ సాగుతుంది. ఎన్నో విస్తుపోయే నిజాలు చూపించారు. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది. ఖర్చు పెట్టిన సమయానికి న్యాయం చేశాడు నగేష్ కుకునూర్.
This post was last modified on July 7, 2025 1:03 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…