సీనియర్ మోస్ట్ హీరో కం కమెడియన్ రాజేంద్ర ప్రసాద్ తన ప్రసంగంలో దొర్లుతున్న తప్పుల వల్ల అవతలి వాళ్ళకే కాదు తనకు తాను ఎంత డ్యామేజ్ చేసుకుంటున్నారో చూసుకోవడం లేదు. ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో ఆలీని, రాబిన్ హుడ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ ని సంబోధించిన తీరు వివాదాలు తీసుకొచ్చింది. తర్వాత ఆయన క్షమాపణ చెప్పడం, ఇంకెప్పుడు రిపీట్ చేయనని హామీ ఇవ్వడం జరిగిపోయాయి. తాజాగా అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో తనను తాను పొగుడుకునే క్రమంలో మళ్ళీ పొరపాట్లు చేయడం మరోసారి హాట్ టాపికయ్యింది. కాకపోతే ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో.
స్పీచ్ లో భాగంగా మాట్లాడుతూ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు ప్రస్తావన తెచ్చిన రాజేంద్రప్రసాద్ ఆయన కేసులు, సూట్ కేసుల్లో ఉన్నప్పుడు తన సినిమాలు చూసే స్వాంతన పొందేవారని చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పుడెప్పుడో దివంగత సి నారాయణరెడ్డిగారు ప్రతి తెలుగు ఇంట్లో మంచం, కంచం లాగా రాజేంద్రప్రసాద్ ఉంటాడని గర్వంగా చెప్పడం కొంచెం సోత్కర్షగానే అనిపించింది. నిమ్మకూరులో ఎన్టీఆర్ ఇంట్లో తాను పుట్టడం , తానా అసోసియేషన్ పుట్టిన 1977లోనే తన కెరీర్ మొదలయ్యిందని చెప్పుకోవడం, సత్య సాయిబాబా జుత్తు మీద జోకు వేయడం చాలా మందికి ఇబ్బందికరంగా అనిపించింది.
కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన రాజేంద్ర ప్రసాద్ ఇలా మాట్లాడ్డం కొత్త కాకపోయినా అంత పెద్ద వేదిక మీద ఇలాంటి స్పీచ్ ఇవ్వడం మీద సర్వత్రా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్టుల్లో చాలా బిజీగా ఉన్న వాళ్లలో ఈయన ముందు వరసలో ఉన్నారు. ఇలాంటి టైంలో మరింత హుందాగా ఉండాలి తప్ప అనవసరంగా వేరొకరు వేలెత్తి చూపేలా ఉండకూడదు. ఒకప్పుడు ఎన్నో క్లాసిక్స్ ఇండస్ట్రీకి అందించిన మాట వాస్తవమే కానీ అవి లేకపోతే పరిశ్రమ ఏమైపోయేదో అన్న రేంజ్ లో చెప్పుకోవడం సరికాదు. మొత్తానికి పెద్దాయన మరోసారి జనం నోళ్ళకు పని చెప్పారు.
This post was last modified on July 6, 2025 10:00 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…