పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు డిసెంబర్ 5 విడుదల లాక్ చేసుకున్న ది రాజా సాబ్ కు ఇప్పటిదాకా పోటీ వచ్చే ఆలోచన ఎవరూ చేయలేదు. ప్రభాస్ ప్యాన్ ఇండియా మూవీ అంటే సహజంగా కాంపిటీషన్ లో ఎవరు ఉండరు. బాహుబలి నుంచి కల్కి దాకా ఇదే జరుగుతూ వచ్చింది. సహజంగానే రాజా సాబ్ కు అలాగే అవుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ఇప్పుడు సీన్ లోకి రణ్వీర్ సింగ్ వచ్చాడు. అతని కొత్త మూవీ దురంధర్ డిసెంబర్ 5 ఫిక్స్ చేసుకుని ఆ మేరకు ఒక టెర్రిఫిక్ టీజర్ తో అనౌన్స్ మెంట్ ఇచ్చింది. యురి ది సర్జికల్ స్ట్రైక్ తో ప్రశంసలు అవార్డులు తెచ్చుకున్న ఆదిత్య ధార్ దీనికి దర్శకుడు.
దురంధర్ లో చాలా విశేషాలున్నాయి. ముఖ్యంగా క్యాస్టింగ్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ లాంటి నటీనటుల లిస్టు పెద్దదే ఉంది. సారా అర్జున్ హీరోయిన్ గా నటిస్తోంది. పైకి గ్యాంగ్ స్టర్ డ్రామాగా కనిపిస్తున్నా హై ఇంటెన్స్ డ్రామాగా ఆడియన్స్ ని కట్టిపడేస్తుందని ముంబై మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వ్యవహారాలు చూసుకునే రా ఏజెన్సీ ఏర్పడిన తొలినాళ్ళలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నారట. యురి తరహాలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని తీసుకున్నారట. శాశ్వత్ సచ్దేవ్ సంగీతం చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల వరకు సమస్య లేదు కానీ దురంధర్ వల్ల రాజా సాబ్ కు ఇబ్బంది ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంటుంది. ముఖ్యంగా మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్ తదితర చోట్ల థియేటర్ల పరంగా అనుకున్న కౌంట్ దక్కదు. దీని వల్ల ప్యాన్ ఇండియా రెవిన్యూలో రణ్వీర్ సింగ్, ప్రభాస్ లు పంచుకోవాల్సి ఉంటుంది. ఏపీ తెలంగాణ వరకు చూసుకుంటే ప్రభాస్ తో క్లాష్ అయ్యేంత రేంజ్ దురంధర్ కు ఉండదు కానీ ఏదైనా టాక్ మీదే ఆధారపడి ఉంటుంది. అఫీషియల్ గా చెప్పేసుకున్నారు కాబట్టి రిలీజ్ డేట్లలో ఎలాంటి మార్పు ఉండబోదు. గత ఏడాది పుష్ప 2 వచ్చిన డేట్ కే ఈసారి మంచి క్లాష్ ఉండబోతోంది.
This post was last modified on July 6, 2025 9:29 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…