జయం, దిల్, సై.. కెరీర్ ఆరంభంలోనే మూడు సక్సెస్‌లు పడ్డాయి. దీంతో నితిన్ ఎక్కడికో వెళ్లిపోతాడనే అంచనాలు కలిగాయి. ఆ తర్వాత డజనుకు పైగా ఫ్లాపులు ఎదురవడంతో తన పనైపోయిందనే అనుకున్నారంతా. కానీ ఆ పరిస్థితుల్లో కూడా అతను ఓపిగ్గా ఎదురు చూశాడు. ‘ఇష్క్’ లాంటి కల్ట్ మూవీతో బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ తర్వాత కూడా మధ్య మధ్యలో ఫ్లాపులు పడుతున్నా.. అప్పుడప్పుడూ ఓ హిట్ కొడుతూ కెరీర్‌ను బాగానే ముందుకు నడిపించాడు. ఏకంగా త్రివిక్రమ్ లాంటి పెద్ద దర్శకుడితో ‘అఆ’ సినిమా చేసి పెద్ద హిట్ కొట్టడంతో తనకు తిరుగులేదనే అనిపించింది.
కానీ తర్వాత నితిన్ సరైన సినిమాలను ఎంచుకోక ఎదురు దెబ్బలు తప్పట్లేదు. ముఖ్యంగా ‘భీష్మ’ తర్వాత నితిన్‌కు హిట్ అన్నదే లేదు. ఒకటి.. రెండు.. మూడు.. ఇలా తన ఫ్లాపుల జాబితాలో ఒక్కో నంబర్ యాడ్ అవుతూ పోతోంది. ఎంతకీ సక్సెస్ మాత్రం దక్కట్లేదు. ఓటీటీలో రిలీజై ఆశించిన స్పందన తెచ్చుకోని ‘మ్యాస్ట్రో’తో కలిపితే అతను ఇప్పటికే అరడజను ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. కొన్ని నెలల కిందటే ‘రాబిన్ హుడ్’ రూపంలో పెద్ద షాక్ తగిలింది. ‘తమ్ముడు’తో అయినా పుంజుకుంటాడని అనుకుంటే.. అదీ నిరాశపరిచింది. దీంతో పోలిస్తే ‘రాబిన్ హుడ్’యే ఎంతో నయం అని జనం అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తొలి షోతోనే ప్రేక్షకుల తిరస్కారానికి గురైన ‘తమ్ముడు’.. వీకెండ్లో కూడా చాలా కష్టంగా నడుస్తోంది. ‘భీష్మ’ తర్వాత వరుసగా నితిన్‌కిది ఏడో ఫ్లాప్ కావడం గమనార్హం.
ఒకప్పుడంటే నితిన్ ఎలాగోలా నెట్టుకొచ్చాడు కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో వరుసగా ఇన్ని ఫెయిల్యూర్లు అంటే చాల ా కష్టం. ఈ ఫ్లాపుల పరంపర చూశాక అందరికీ నితిన్ పాత రోజులు గుర్తుకు వస్తాయి. అప్పట్లో మాదిరి డజను ఫ్లాపులు ఎదురైనా తట్టుకుని నిలబడడం తేలిక కాదు. ప్రస్తుతం ఒక సినిమా ఫెయిలైతే నష్టం భారీగా ఉంటోంది. నిర్మాత కుదేలైపోతున్నాడు. ఇప్పటికే ‘తమ్ముడు’తో దెబ్బ తిన్న రాజు.. మళ్లీ నితిన్‌తో ‘యల్లమ్మ’ తీయడానికి రెడీ అవుతున్నాడు. మరి ఆ చిత్రంతో అయినా నితిన్‌కు ఓ విజయం దక్కి అతను మళ్లీ లేచి నిలబడతాడేమో చూడాలి.
This post was last modified on July 6, 2025 12:00 pm
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…