హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చి రెండు రోజులు దాటేసింది. వ్యూస్ పరంగా ఫస్ట్ డే యూట్యూబ్ రికార్డులు బద్దలైపోయాయి. ఆ మధ్య దిల్ రాజు అన్నట్టు ఇవి జెన్యూన్ గా వచ్చాయా లేక హైప్ కోసం కొన్నవా అనేది కౌంట్ ని బట్టి చెప్పలేం కానీ మొత్తానికి ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు. దీని కోసమే బిజినెస్ డీల్స్ అన్నీ క్లోజ్ చేయకుండా వెయిట్ చేసిన నిర్మాత ఏఎం రత్నం ఇప్పుడు ఏరియాల వారీగా వస్తున్న బయ్యర్ల చర్చల్లో బిజీగా ఉన్నారని సమాచారం. ఏపీ తెలంగాణ కలిపి సుమారు వంద కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ ఆశిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్ ఉంది. పవన్ ఇమేజ్ కి ఇదేమి భారీ మొత్తం కాదు.
కాకపోతే విపరీతమైన జాప్యం హైప్ మీద ప్రభావం చూపించడంతో పంపిణీదారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ట్రైలర్ సంతృప్తికరంగానే ఉన్నా బాహుబలి, ఆర్ఆర్ఆర్ స్థాయిలో ఎడిటింగ్ జరగలేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో లేకపోలేదు. సమయాభావం వల్ల దర్శకుడు జ్యోతికృష్ణ బృందం పీకల మీద కత్తులు పెట్టుకుని పని చేస్తున్నారు. ఇలాంటి ఒత్తిడిలో క్వాలిటీ పరంగా కొన్ని హెచ్చుతగ్గులు ఉండొచ్చు కానీ అసలు సినిమాలో ఎలాంటి మైనస్సులు ఉండవని, బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే దిశగా తమ టీమ్ పడిన కష్టం మర్చిపోలేని అనూభూతినిస్తుందని అంటున్నారు.
జూలై 24 చాలా మంచి డేట్. బాక్సాఫీస్ దగ్గర కుబేర తర్వాత మళ్ళీ వసూళ్ల గ్రాఫ్ పడిపోయింది. కన్నప్ప జోరు మూడు రోజులకే పరిమితం కాగా ఎన్నో ఆశలు పెట్టుకున్న నితిన్ తమ్ముడు తీవ్రంగా నిరాశపరిచింది. జూలై 11 వచ్చే ఓ భామ అయ్యో రామా, జూలై 18 రిలీజయ్యే జూనియర్ వగైరాలు మరీ టెన్షన్ పడేంత సినిమాలు కావు. ఎక్స్ ట్రాడినరి టాక్ వస్తేనే జనం వీటివైపు చూస్తారు. ప్రస్తుతానికి వినిపిస్తున్న రిపోర్ట్స్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ వర్గాలు హరిహర వీరమల్లు మీద పాజిటివ్ గానే ఉన్నాయి. రిలీజ్ కు ఇంకో 19 రోజులు మాత్రమే టైం ఉండటంతో ఇంకో వారంలో మొత్తం బయ్యర్ల లిస్టు సిద్ధమైపోతుంది.
This post was last modified on July 5, 2025 2:43 pm
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…