ఈ రోజు నితిన్ తమ్ముడు రిలీజయ్యింది. తన కెరీర్ లోనే అత్యథిక బడ్జెట్ తో రూపొందిన యాక్షన్ మూవీగా దీని మీద అభిమానుల అంచనాలు మాములుగా లేవు. అందులోనూ చాలా క్యాలికులేటెడ్ ఉండే నిర్మాత దిల్ రాజు కేవలం ప్రొడక్షన్ కే ముప్పై అయిదు కోట్లు ఖర్చు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో గేమ్ ఛేంజర్ టాపిక్ వివాదం కాగా దానికి క్షమాపణతో శిరీష్ చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. దీని వల్ల తమ్ముడు పబ్లిసిటీ కొంత డైవర్ట్ అయినప్పటికీ టాక్ తో కంటెంట్ కనక మెప్పిస్తే ఇదంతా మర్చిపోయే వ్యవహారమే కాబట్టి ఆశలన్నీ పబ్లిక్ మీదే ఉన్నాయి.
తమ్ముడుకి మంచి అవకాశాలున్నాయి. కుబేర ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది. కన్నప్ప నెమ్మదించాడు. బాక్సాఫీస్ దగ్గర గ్యాప్ ఉంది. చూడొచ్చు అనే మాట తెచ్చుకున్నా చాలు నితిన్ కోసం వచ్చే ప్రేక్షకులు ఉన్నారు. సూపర్ ఓపెనింగ్ దక్కకపోయినా టాక్ పాజిటివ్ గా ఉంటే మాత్రం వేగంగా పికపయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ తర్వాత ఎస్విసి బ్యానర్ నుంచి వస్తున్న సినిమా ఇదే. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చేశాక దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ తమ్ముడు స్క్రిప్ట్ మీద చాలా సమయం ఖర్చు పెట్టారు. ఆ శ్రమ చూసే దిల్ రాజు ఖర్చు విషయంలో వెనుకాడలేదన్నది స్పష్టమవుతోంది.
ఓవర్సీస్ రిపోర్టుల సంగతి ఎలా ఉన్నా తమ్ముడుకి ముఖ్యంగా కావాల్సింది బీసీ సెంటర్ల సపోర్ట్. మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అవి కనక కనెక్ట్ అయితే కలెక్షన్లు రాబట్టవచ్చు. వచ్చే వారం రావాల్సిన అనుష్క ఘాటీ వాయిదా పడింది. హరిహర వీరమల్లుకి ఇంకో ఇరవై రోజుల టైం ఉంది. తమ్ముడు కనక ఈ అడ్వాంటేజ్ వాడుకుంటే మూడు వారాలు స్ట్రాంగ్ రన్ దక్కుతుంది. దిల్ రాజు సెట్ చేసుకున్న రిలీజ్ డేట్ మంచి స్ట్రాటజీతో ఉంది. కాకపోతే దాన్ని నిలబెట్టుకునే టాక్, రివ్యూస్ కీలకం కాబోతున్నాయి. కెరీర్ పరంగా కాస్త డీలాగా ఉన్న నితిన్ కు తమ్ముడు ఆక్సీజన్ ఇవ్వాలి. ఫ్యాన్స్ కోరుకుంటున్నది అదే.
This post was last modified on July 4, 2025 9:56 am
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…