సరిగ్గా పది సంవత్సరాల క్రితం వచ్చిన సల్మాన్ ఖాన్ భజరంగి భాయ్ జాన్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా గుర్తుందిగా. అప్పుడా పాప వయసు కేవలం 7 సంవత్సరాలు. అంత చిన్న ఏజ్ లోనూ మెచ్యూర్డ్ గా నటించిన తీరు విమర్శకులను మెప్పించింది. కథ తన చుట్టే తిరిగే పాత్రను అవలీలగా పండించిన విధానం ఏకంగా ఫిలిం ఫేర్ అవార్డు తీసుకొచ్చింది. పలు స్క్రీన్ పురస్కారాలు దక్కాయి. అయితే ఆ తర్వాత చదువుకు అంకితమైపోయిన హర్షాలీ ఎన్ని ఆఫర్లు వచ్చినా సినిమాల్లో నటించలేదు. కుబూల్ హై, లౌట్ ఆవో త్రిష లాంటి టీవీ సీరియల్స్ లో నటించింది కానీ వెండితెరకు దూరంగా ఉంది.
ఇప్పుడీ హర్షాలీ మల్హోత్రా టీనేజ్ కొచ్చింది. ఈడొచ్చిన అమ్మాయిగా రీ ఎంట్రీ ఇస్తోంది. అది కూడా ఆషామాషీ సినిమాలో కాదు. బాలకృష్ణ అఖండ 2 తాండవంలో జనని పాత్ర చేస్తోంది. దర్శకుడు బోయపాటి శీనుకి ఈ ఆలోచన ఎలా వచ్చిందో కానీ నిజంగా ఈ సెలక్షన్ కు సూపర్ అనాల్సిందే. ఆమె ఫస్ట్ లుక్ చూసిన బాలయ్య అభిమానులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిన్నతనంలో ఈమెను కాపాడే అఘోరాగా బాలకృష్ణ చూపించిన విశ్వరూపం ఈసారి నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతుంది. ప్రస్తుతం మోడలింగ్ చేస్తున్న హర్షాలీ బాలీవుడ్ డెబ్యూ ఇంకా చేయలేదు. నాస్తిక్ అనే మూవీ ప్రతిపాదన దశలో ఉంది.
సెప్టెంబర్ 25 విడుదల ప్రకటించిన అఖండ 2 అనుకున్న టైంకి వచ్చేలా ఉంది. పవన్ కళ్యాణ్ ఓజి రిలీజైనా కాకపోయినా క్లాష్ కు సిద్ధపడే ఉన్నారని ఇన్ సైడ్ టాక్. థియేటర్ల కేటాయింపుకు సంబంధించిన చర్చలు ఆల్రెడీ మొదలైపోయాయట. అందుకే షూటింగ్ వేగంగా జరుగుతోందట. డిసెంబర్ లేదా సంక్రాంతికి వెళ్లే ఆలోచనలో బాలయ్య లేరని అంటున్నారు. బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజ్ ఉన్న అఖండ 2కి నార్త్ మార్కెట్ లోనూ డిమాండ్ ఎక్కువగా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్కతా లాంటి నగరాల్లో ప్రత్యేక ప్రమోషన్లు చేస్తున్నారు. తమన్ ఇవ్వబోయే సంగీతం గురించి మ్యూజిక్ లవర్స్ లో విపరీతమైన హైప్ నెలకొంది.
This post was last modified on July 2, 2025 5:16 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…