అదేంటి అంత పెద్ద ప్యాన్ ఇండియా మల్టీస్టారర్ ప్రమోషన్లలో హీరోలు కలవకపోవడం ఏమిటని అనుకుంటున్నారా. అసలు మెలిక ఇక్కడే ఉంది. ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న వార్ 2 కోసం యష్ రాజ్ ఫిలింస్ ఒక వెరైటీ స్ట్రాటజీ వేస్తోంది. అదేంటంటే పాతిక రోజుల పాటు జరిగే ప్రమోషన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలలో ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి పాల్గొనరట. ఏదైనా, ఎక్కడైనా సరే విడివిడిగానే కనిపిస్తారు. ఎంత పెద్ద మీడియా అడిగినా సరే సపరేట్ గా వస్తారు తప్పించి చేతుల్లో చేతులు వేసుకుని మాత్రం కాదు. నిర్మాత ఆదిత్య చోప్రా సెంటిమెంట్ ప్లస్ పద్ధతి ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారట.
గతంలో వార్ టైంలో కూడా హృతిక్, టైగర్ శ్రోఫ్ లకు సైతం ఇదే ఫాలో అయ్యారు. సక్సెస్ మీట్ నుంచి ఇద్దరినీ కలిపారు. ఇక వార్ 2 విషయానికి వస్తే మొదటిసారి ఒక క్రేజీ కాంబినేషన్ తెరకెక్కింది కాబట్టి దాన్ని పదే పదే టీవీలు, యూట్యూబ్ లో చూపిస్తూ ఉంటే బిగ్ స్క్రీన్ మీద చూసేనాటికి థ్రిల్ తగ్గిపోతుందని యష్ అధినేత ఆలోచనట. ఒకేసారి థియేటర్ కు వచ్చాక వాళ్ళ కలయికను చూసినప్పుడు కలిగే కిక్కుని ముందుగానే చంపకూడదనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశారన్న మాట. ఒకరకంగా చెప్పాలంటే రాజమౌళికి రివర్స్ ప్లాన్. ఆర్ఆర్ఆర్ కోసం ఆయన ఇద్దరు హీరోలను దేశమంతా తిప్పడం చూశాం.
కూలీ నుంచి చాలా పెద్ద కాంపిటీషన్ ఎదురుకుంటున్న వార్ 2 తెలుగు రాష్ట్రాల హక్కులను సితార ఎంటర్ టైన్మెంట్స్ సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. దేవర తరహాలో థియేటర్లు బాగా దక్కుతాయని వాళ్ళ నమ్మకం. ఏపీ తెలంగాణ కలిపి సుమారు 80 కోట్లకు డీల్ జరిగిందనే టాక్ ఉంది కానీ అఫీషియల్ నెంబర్ ఇంకా బయటికి రాలేదు. ఈ రికవరీ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ భుజాల మీదే ఉంటుంది. ఎందుకంటే బిసి సెంటర్స్ లో హృతిక్ రోషన్ ఇమేజ్ పని చేయదు. తెలుగు జనాలు చూసేది తారక్ కోసమే. దానికి అనుగుణంగా భారీ ఎత్తున ప్రమోషనల్ యాక్టివిటిస్ డిజైన్ చేయబోతున్నట్టు టాక్.
This post was last modified on July 2, 2025 1:07 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…