ప్రపంచవ్యాప్తంగా రియాలిటీ షోలలో కొత్త ట్రెండ్ సృష్టించిన బిగ్ బాస్ తెలుగులో తొమ్మిదో సీజన్ లో ఉండగా కన్నడలో పదకొండు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే పన్నెండో భాగం నుంచి తాను హోస్ట్ చేయనని ఈగ విలన్ కిచ్చ సుదీప్ ఆ మధ్య ప్రకటించడం ఫ్యాన్స్ లో కలకలం రేపింది. మీరే ఉండాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. దీంతో సుదీప్ మనసు మార్చుకుని బిగ్ బాస్ 12 పగ్గాలు తీసుకునేందుకు అంగీకరించారు. ఇంత భారీ షో నుంచి ఎందుకు తప్పుకున్నారనే కారణం అడిగితే ఇతర భాషల్లో బిగ్ బాస్ కు దక్కినంత ఆదరణ కన్నడలో లేకపోవడం వల్లే ఆసక్తి తగ్గిందని చెప్పుకొచ్చారు.
ఈసారి గేమ్ లో సమూల మార్పులు తెచ్చేందుకు నిర్వాహకులు అంగీకరించడంతో బిగ్ బాస్ 12తో పాటు మరో నాలుగు సీజన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తాజాగా బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రకటించారు. నిజానికి తెలుగు కన్నా చాలా ముందుగానే కన్నడ బిగ్ బాస్ మొదలయ్యింది. కానీ మనతో పాటు హిందీ, తమిళం అంత పాపులారిటీ సంపాదించుకోలేదు. సెలబ్రిటీల ఎంపిక, పార్టిసిపెంట్స్ పెర్ఫార్మన్స్ లాంటి కారణాలు ఆదరణ తగ్గేలా చేశాయి. దీంతో ఇంత కష్టపడి యాంకరింగ్ చేస్తే ఫలితం లేదని భావించిన సుదీప్ డ్రాప్ అవ్వాలని చూశాడు. కానీ ఫ్యాన్స్ డిమాండ్ మేరకు వెనుకడుగు వేశాడు.
మన దగ్గర ఇంత సమస్య లేదు. నాగార్జున హోస్టింగ్ లో రేటింగ్స్ బాగానే వస్తున్నాయి కానీ ఇంకాస్త మెరుగు పడాల్సిన అవసరం చాలా ఉంది. ఫైనల్ ఎపిసోడ్స్ తప్ప మిగిలిన రోజుల్లో టిఆర్పి అంతగా రావడం లేదు. ఈసారి సామాన్యులకు ఛాన్స్ ఇస్తోంది అందుకే. తమిళంలో కమల్ హాసన్ తప్పుకున్నాక ఆ బాధ్యతని విజయ్ సేతుపతి సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాడు. హిందీలో సల్మాన్ ఖాన్ దిగ్విజయంగా నడిపిస్తున్నాడు. పొరపాట్లు జరిగాయి కాబట్టే అంత హిట్ కాలేదని సుదీప్ లాంటి యాంకర్లు ఓపెన్ గా చెప్పడం, అవి సరి చేస్తామని నిర్వాహకులు ఒప్పుకోడం బిగ్ బాస్ లో అరుదుగా జరిగే పరిణామాలు.
This post was last modified on July 1, 2025 6:23 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…