ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న తమ్ముడు మీద నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారనే విషయం నిన్న ఈవెంట్ లో అర్థమైపోయింది. ముందు రోజే ప్రీమియర్లు వేయడం రిస్కని తెలిసినా దానికి సిద్ధపడటం చూస్తే నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా సక్సెస్ మీద ఒకరిద్దరు కాదు ఎందరో ఆశలు పెట్టుకున్నారు. ముందుగా చెప్పుకోవాల్సింది నితిన్ గురించే. గత కొన్నేళ్లుగా వరస ఫ్లాపులతో బాగా లోగా ఉన్న తనకు అర్జెంట్ గా బ్లాక్ బస్టర్ పడాలి. ఖైదీ తరహాలో కనిపిస్తున్న తమ్ముడు కంటెంట్ కనక మాస్ కి కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వసూళ్లు క్యూ కట్టేస్తాయి.
కాంతార ఫేమ్ సప్తమి గౌడ తమ్ముడుతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇది సక్సెస్ అయితే మరిన్ని అవకాశాలు తలుపు తడతాయి. చాలా గ్యాప్ తీసుకున్న సీనియర్ హీరోయిన్ లయ ఇందులో అక్కగా చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశారు. లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులకు మంచి డిమాండ్ ఉన్న టైంలో ఈవిడకు బ్రేక్ దొరికితే హైదరాబాద్ లోనే సెటిల్ కావచ్చు. టాలెంట్ ఉన్నా పెద్ద ఛాన్సులు దూరంగా ఉన్న వర్ష బొల్లమకు సైతం తమ్ముడు విజయం కీలకం. విరూపాక్ష తర్వాత మళ్ళీ ఆ స్థాయి మేజిక్ చూపించలేకపోయిన సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ తమ్ముడుతో హిట్టు కొడితే స్టార్ హీరోల పిలుపులు అందుకోవచ్చు.
పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ తో వకీల్ సాబ్ చేశాక వేణు శ్రీరామ్ కు టయర్ 1 హీరోల నుంచి పిలుపు రాలేదు. అందుకే తమ్మడు మీద కసితో పని చేశారు. సెంటిమెంట్, ఎమోషన్ కి యాక్షన్ జోడించి పెద్ద ప్రయోగమే చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ స్ట్రీక్ ని తమ్ముడు కొనసాగిస్తుందని దిల్ రాజు భరోసాగా చెబుతున్నారు. మరి ఇందరి ఆశలు మోస్తున్న తమ్ముడుకి శకునాలు బాగున్నాయి. కుబేర ఫైనల్ రన్ వైపు వెళ్తోంది. కన్నప్ప వండర్స్ చేయడం కష్టమే. సో ఈ గ్యాప్ ని వాడుకోవడానికి నితిన్ కిదే గోల్డెన్ ఛాన్స్. పాజిటివ్ టాక్ రావడం ఆలస్యం కనీసం రెండు వారాల పాటు సాలిడ్ కలెక్షన్ల రాబట్టొచ్చు.
This post was last modified on July 1, 2025 10:58 am
బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…