సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ కు కాపీ, రీమిక్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కేవలం ఆ కారణంగానే గద్దలకొండ గణేష్ అవకాశాన్ని వదులుకున్నాడు. విపరీతమైన పాత పాటల రెఫరెన్సులున్న గుడ్ బ్యాడ్ అగ్లీ వదులుకున్నాడు. ఇలా పైకి తెలిసినవి కొన్ని ఉంటే బయటికి రానివి బోలెడు ఉంటాయి. ఒరిజినల్ తప్ప వేరేది తీసుకోననే దేవికి తన ట్యూన్లు ఇతరులు కాపీ కొట్టే బెడద లేకపోలేదు. పుష్ప 1 ది రైజ్ లో ఛార్ట్ బస్టర్ సాంగ్ అయిన ఊ అంటావా మావా ఊహూ అంటావా మామని ఒక టర్కిష్ గాయని తస్కరించేసింది. ఆమె పేరు అతియే. ఏడు నెలల క్రితం రిలీజ్ చేసిన ఆడియో ట్రాక్ లో శుభ్రంగా వాడేసుకుంది.
దీనిపై లీగల్ చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు దేవిశ్రీ ప్రసాద్ చెబుతున్నాడు. ఎక్కడో అంతర్జాతీయ సింగర్లు ఇలా తన పాటలు వాడుకోవడం సంతోషంగా ఉన్నా క్రెడిట్స్ ఇవ్వకుండా అదేదో సొంత కంపోజింగ్ తరహాలో ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ చేసుకోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నాడు. పుష్ప సక్సెస్ లో సమంత ఆడిపాడిన ఊ అంటావా ఐటెం సాంగ్ పాత్ర చాలా ఉంది. సామ్ కు బాలీవుడ్ లో పాపులారిటీ పెరిగేందుకు ఇది చాలా దోహదం చేసింది. కానీ ఒక విదేశీ గాయని స్ఫూర్తి పేరుతో వాడేసుకోవడం మాత్రం ఖచ్చితంగా అభ్యంతరకరమే. నిజంగా దేవి లీగల్ గా ముందుకు వెళ్తాడేమో చూడాలి.
దీని సంగతి పక్కనపెడితే వరస హిట్లతో దేవిశ్రీ ప్రసాద్ మంచి జోష్ మీద ఉన్నాడు. పుష్ప 2, తండేల్, కుబేర మూడూ సూపర్ హిట్ అయ్యాయి. మ్యూజికల్ గానూ ఛార్ట్ బస్టర్స్ అనిపించుకున్నాయి. అందుకే కొత్త ఉత్సాహంతో ఉస్తాద్ భగత్ సింగ్ పనులు మొదలుపెట్టాడు. ఈసారి గబ్బర్ సింగ్ ని మించిన ఆల్బమ్ ఇస్తాడని ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. రెండు దశాబ్దాల కెరీర్ తర్వాత కూడా బెస్ట్ అవుట్ ఫుట్ ఇస్తున్న దేవి ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి కొడుకు పరిచయమవుతున్న జూనియర్ సినిమాకు వర్క్ చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్. హీరో కొత్తవాడే అయినా మ్యూజిక్ పరంగా దేవి ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడట.
This post was last modified on June 30, 2025 9:34 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…