కొన్ని వారాల క్రితం హేరా ఫేరీ 3 నుంచి తాను తప్పుకుంటున్నట్టు సీనియర్ నటుడు పరేష్ రావల్ ప్రకటించడం బాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపింది. ఆయన లేకుండా సీక్వెల్ ఏంటని ఆ ఫ్రాంచైజ్ లవర్స్ ఎక్స్ వేదికగా వేలల్లో ట్వీట్లు పెట్టారు. అయితే తాజాగా పరేష్ రావల్ ఇచ్చిన ఒక ప్యాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో ఈ వివాదం సమిసిపోయిందని, అందరూ కష్టపడి ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలనే సంకల్పం పెట్టుకోవాలని చెప్పడం చూసి జనాలు ఆశ్చర్యపోయారు. అంటే హేరా ఫేరీ 3లో నేనున్నాననే సంకేతం ఇచ్చినట్టేగా. అయితే దీని వెనుక పెద్ద మతలబే జరిగిందని బాలీవుడ్ మీడియా వర్గాల కథనం. అదేంటో చూద్దాం.
హేరా ఫేరీ 3 లో పరేష్ రావల్ చేయడం లేదని తెలిశాక హక్కులు కొన్న నిర్మాత కం హీరో అక్షయ్ కుమార్ ఏకంగా పాతిక కోట్ల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ కోర్టుకు వెళ్ళాడు. దానికి పరేష్ లాయర్లు కౌంటర్లు ఇస్తూ కాలం గడిపారు. అయితే ఈ కాంట్రావర్సి కన్నా ముందు ఈ సినిమాలో నటించేందుకు గాను ఇస్తామన్న 15 కోట్ల రెమ్యునరేషన్ లో కేవలం 11 లక్షలు మాత్రమే అడ్వాన్స్ ఇచ్చి మిగిలిన 14 కోట్ల 89 లక్షలను రిలీజైన నెల తర్వాత ఇచ్చేలా ఒప్పందం అడిగారట. దీంతో పరేష్ రావల్ కు ఇది న్యాయంగా అనిపించలేదు. డిమాండ్ చేయడం కన్నా మౌనంగా తప్పుకోవడం మేలని భావించి అదే బయటికి చెప్పేశారు.
న్యాయస్థానం చుట్టూ తిరగడం కన్నా రాజీ పడి సినిమా చేయడం మేలని భావించి అక్షయ్, పరేష్ ఇద్దరూ భావించడం వల్లే కథ క్లైమాక్స్ కు చేరుకుందని అంటున్నారు. అంటే పరేష్ కోరినట్టు రిలీజ్ కు ముందే పారితోషికం ఇచ్చేలా అగ్రిమెంట్ జరిగి ఉండొచ్చు. ఏది ఏమైనా ఇది శుభవార్తే. హేరా ఫేరీ 3ని పెద్దాయన లేకుండా ఊహించుకోవడం అసాధ్యం. మొత్తానికి శుభం కార్డు వేశారు. అంతా బాగానే ఉంది కానీ ఇంత సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత అప్పటి కామెడీ మేజిక్ ని మళ్ళీ సృష్టించడం అంత ఈజీ కాదు. ఎంత ప్రియదర్శనే దర్శకుడైనా చాలా పెద్ద సవాలే. మొదటి రెండు భాగాలను మించిన బ్లాక్ బస్టర్ ఇవ్వాలి మరి.
This post was last modified on June 30, 2025 1:18 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…