హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న తేజ సజ్జ కొత్త ప్యాన్ ఇండియా మూవీ మిరాయ్ సెప్టెంబర్ 5 విడుదలని లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ఏప్రిల్ లో రావాలని అనుకున్నప్పటికీ షూటింగ్ లో జాప్యంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల నాలుగు నెలలు వాయిదా వేసుకుంది. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో మంచు మనోజ్ విలనిజం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని ఇప్పటికే టాక్ ఉంది. సోలో రిలీజ్ కోసం ట్రై చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మంచి డేట్ పట్టుకుంది కానీ మరో రెండు గండాలు పోటీ రూపంలో ముంచుకు రాబోతున్నాయి.
దుల్కర్ సల్మాన్ కాంతని సెప్టెంబర్ 5 విడుదల చేసేందుకు నిర్మాత రానా దగ్గుబాటి ప్లాన్ చేస్తున్నట్టు ఫ్రెష్ అప్డేట్. ఇది చాలా నెలలుగా నిర్మాణంలో ఉన్న భారీ ప్రాజెక్టు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. పీరియాడిక్ సెటప్ లో డిఫరెంట్ థ్రిల్లర్ గా తీస్తున్నారట. ఇది కాకుండా శివ కార్తికేయన్ మదరాసి సైతం అదే డేట్ కు వస్తోంది. గతంలోనే అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మీద మంచి అంచనాలున్నాయి. సికందర్ డైరెక్టర్ ట్రాక్ రికార్డు కన్నా అమరన్ హీరోగా జరిగే మార్కెటింగ్ మీద నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.
ఇదే జరిగితే మిరాయ్ కు ఇతర రాష్ట్రాల్లో పోటీ పరంగా చిక్కులు తప్పవు. కంటెంట్ బలంగా ఉన్నప్పుడు ఎలాంటి కాంపిటేషన్ అయినా తట్టుకోవచ్చని హనుమాన్ గతంలో నిరూపించింది. మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లను దాటుకుని తేజ సజ్జ గెలిచాడు. ప్రతిసారి అలాగే జరుగుతుందని కాదు కానీ నాన్ సంక్రాంతి సీజన్ లో ఎంతైనా పోటీ వల్ల రిస్క్ ఉంటుంది. మిరాయ్ లో ఉన్న సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ ఇచ్చేలా ఉంటాయని టీమ్ చెబుతోంది. రాజా సాబ్ కన్నా ముందు పీపుల్స్ మీడియా నుంచి వస్తున్న సినిమా కావడంతో మిరాయ్ మీద బయ్యర్ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.
This post was last modified on June 30, 2025 11:49 am
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…