వివాదాలు విశేషాలు సమన స్థాయిలో మోసుకొచ్చే రియాలిటీ షో బిగ్ బాస్ 9కు రంగం సిద్ధమవుతోంది. ఈసారి యాంకర్ మారతారని ఏవేవో ప్రచారాలు జరిగాయి కానీ స్టార్ మా ఛానల్ మళ్ళీ ఆ బాధ్యతను అక్కినేని నాగార్జునకే ఇచ్చింది. ఈ మేరకు తాజాగా ఒక ప్రోమో కూడా వదిలింది. అయితే బిగ్ బాస్ గత రెండు మూడు సీజన్లు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకునే క్రమంలో కొంత స్ట్రగుల్ అవుతున్నాయి. ఏదైనా వైవిధ్యంగా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమయింది. అందుకే ఈసారి రూటు మార్చి సెలబ్రిటీలతో పాటు సామాన్యులను భాగం చేసే విధంగా కొత్త ప్లాన్ వేశారు.
కాకపోతే దానికో ప్రొసీజర్ ఉంటుంది. సంస్థ చెప్పిన వెబ్ సైట్ లో బిగ్ బాస్ 9లో ఎందుకు పాల్గొనాలో చెబుతూ ఒక వీడియో రూపొందించి దాన్ని స్టార్ మాకు పంపించాలి. వచ్చినవన్నీ పరిశీలించి బెస్ట్ అనిపించిన వాళ్ళను ఆడిషన్లకు పిలుస్తారు. అక్కడ పాసైతే నేరుగా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. విధి విధానాలకు సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది మంచి ఎత్తుగడే. దీని వల్ల కామన్ ఆడియన్స్ తో కనెక్షన్ పెరుగుతుంది. ఎంతసేపూ సోషల్ మీడియా సెలబ్రిటీల మీదే ఆధారపడటం ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు. సీజన్ 8 రిజల్ట్ లో ఇది స్పష్టమయ్యింది.
కుబేర బ్లాక్ బస్టర్ తో మంచి ఊపుమీదున్న నాగార్జునకు ఆగస్ట్ లో రిలీజయ్యే కూలీలో మరో ప్రత్యేక మైల్ స్టోన్ కానుంది. బిగ్ బాస్ 9 దసరా నుంచి ప్రారంభమయ్యే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. అంటే 2025లో నాగార్జున మొత్తం మూడుసార్లు అభిమానులను పలకరించినట్టు అవుతుంది. నా సామిరంగా తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న నాగ్ కు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తోంది. త్వరలో తన వందో సినిమాకు రెడీ అవుతున్న నాగార్జున దానికి సంబంధించిన వివరాలు చెప్పడం లేదు. ఇక బిగ్ బాస్ 9 ఈసారి వివాదాలు పెంచుతోందో లేక ఇంకేదైనా డిఫరెంట్ రూట్ లో వెళ్తుందేమో చూడాలి.
This post was last modified on June 29, 2025 7:30 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…