Movie News

ఆ సంగీత దర్శకుడిని మళ్లీ తేబోతున్న కమ్ముల

కె.ఎం.రాధాకృష్ణన్.. తెలుగు సంగీత ప్రియుల మీద బలమైన ముద్ర వేసిన సంగీత దర్శకుడు. ఆనంద్, గోదావరి, చందమామ లాంటి చిత్రాల్లో తన పాటలు, నేపథ్య సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలు వచ్చి రెండు దశాబ్దాలు దాటినా ఇంకా తెలుగు ఫ్యామిలీస్ ఇళ్లలో ఈ పాటలు మార్మోగుతూనే ఉన్నాయి. ఐతే శేఖర్ కమ్ముల పరిచయం చేసిన ఈ సంగీత దర్శకుడు.. ఒక దశ తర్వాత అంచనాలను అందుకోలేకపోయాడు. 

తన శైలికి తగ్గ సినిమాలు పడకపోవడం వల్లో ఏమో.. తన పాటలు క్లిక్ కాలేదు. రాధాకృష్ణన్ నుంచి అద్భుతమైన పాటలు రాబట్టుకున్న కమ్ముల, కృష్ణవంశీ.. మళ్లీ తనతో కలిసి పని చేయలేదు. బలాదూర్ సహా అతను కొన్ని పేరున్న సినిమాలకే పని చేశాడు కానీ.. తన ప్రత్యేకతను చాటుకోలేకపోయాడు. చాలా ఏళ్లుగా తన పేరే వినిపించడం లేదు. ఒకప్పటి రాధాకృష్ణన్ పాటలు విన్నపుడల్లా ఇంతటి ప్రతిభావంతుడు ఏమైపోయాడో అనిపిస్తుంది.

ఐతే గతంలో రాధాకృష్ణన్‌కు బ్రేక్ ఇచ్చిన శేఖర్ కమ్ములనే మళ్లీ అతణ్ని టాలీవుడ్లోకి తిరిగి తీసుకురావాలని చూస్తున్నాడు. ‘కుబేర’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కమ్ముల.. తన తర్వాతి చిత్రం గురించి మాట్లాడుతూ, మళ్లీ రాధాకృష్ణన్‌తో పని చేసే అవకాశం ఉన్నట్లు చెప్పాడు. ఆనంద్, గోదావరి చిత్రాలకు రాధాకృష్ణన్ అద్భుతమైన పాటలు ఇచ్చాడని.. ఐతే ‘హ్యాపీ డేస్’తో తమ కాంబినేషన్ బ్రేక్ అయిందని కమ్ముల చెప్పాడు. 

అది మోడర్న్ సినిమా కావడంతో క్లాసికల్ టచ్ ఉన్న రాధాకృష్ణన్ పాటలు దానికి నప్పవన్న ఉద్దేశంతో తనతో పని చేయలేకపోయానని కమ్ముల చెప్పాడు. మళ్లీ రాధాకృష్ణన్‌తో కచ్చితంగా పని చేస్తానని.. టాలెంట్ ఎక్కడికీ పోదని, గ్యాప్ వచ్చినా సరే రాధాకృష్ణన్ మళ్లీ వస్తాడని కమ్ముల ధీమా వ్యక్తం చేశాడు. తన తర్వాతి సినిమా ఫక్తు ప్రేమకథగా ఉంటుందని.. హార్డ్ హిట్టింగ్ సినిమాలు తీశాక లవ్ స్టోరీలు తీయడం తనకు అలవాటని.. కొత్తగా ఉండే ప్రేమకథ చేయాలనుకుంటున్నానని.. దాని కోసం కొంచెం టైం తీసుకుంటానని కమ్ముల చెప్పాడు.

This post was last modified on June 29, 2025 6:45 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

36 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago