Movie News

దేవి పాట.. హాలీవుడ్లో కాపీ

హాలీవుడ్ సినిమాలను మన వాళ్లు కాపీ కొట్టడం దశాబ్దాల నుంచి చూస్తున్నాం. అలాగే అక్కడి మ్యూజిక్ ఆల్బమ్స్ నుంచి మన మ్యూజిక్ డైరెక్టర్లు ట్యూన్స్ లేపేసి తెలివిగా పాటలు చేసేస్తుంటారు. ఇంటర్నెట్ విప్లవం వల్ల ఇప్పుడు ఎవరు ఎక్కడి పాటను కాపీ కొట్టినా ఈజీగా తెలిసిపోతోంది కానీ.. గతంలో ఈ విషయం బయటపడేది కూడా కాదు. ఐతే అక్కడి కంటెంట్‌ను ఇక్కడ కాపీ కొట్టడం ఎప్పట్నుంచో చూస్తున్నాం కానీ.. మన పాటను హాలీవుడ్లో కాపీ కొట్టడం మాత్రం షాకింగ్‌గా అనిపించే విషయమే.

ఇప్పుడు అదే జరిగింది. ‘పుష్ప’ సినిమాలో బ్లాక్ బస్టర్ అయిన ‘ఊ అంటావా ఊహూ అంటావా’ పాటను ఒక హాలీవుడ్ మ్యూజిక్ ఆల్బంలో అనుకరించడం విశేషం. ఆ పాటకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పాటను కాపీ కొట్టిన విషయాన్ని దేవిశ్రీ ప్రసాద్ సైతం గుర్తించాడు. ఆ కాపీ కొట్టిన వాడి మీద కేసు వేయాలా అని ఆలోచిస్తున్నా అంటూ దేవి సరదాగా వ్యాఖ్యానించాడు.

నిన్న అగ్ర నిర్మాత దిల్ రాజు లాంచ్ చేసిన ‘దిల్ రాజు డ్రీమ్స్’ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన దేవి.. ‘ఊ అంటావా’ పాటను హాలీవుడ్లో కాపీ కొట్టడం గురించి తన ప్రసంగం మధ్యలో ప్రస్తావించాడు. మనం చేయబోయే క్రియేషన్ ఎంత చిన్నదో, ఎంత పెద్దదో మనకే తెలియదని పేర్కొన్న దేవి.. చెన్నైలో తన స్టూడియోలో కూర్చుని కేవలం ఐదు నిమిషాల్లో క్రియేట్ చేసిన ‘ఊ అంటావా మావా ఊహూ అంటావా మావా’ పాటను ఇప్పుడు ఏకంగా హాలీవుడ్లో కాపీ కొట్టారని దేవి తెలిపాడు.

ప్రపంచంలో ఈ పాట ప్లే అవ్వని ప్రదేశం అంటూ ఉండకపోవచ్చని.. ఈ క్రమంలోనే ఎవరో హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ పాటను కాపీ చేశాడని.. తన మీద కేసు వేయాలా ఏం చేయలా అని ఆలోచిస్తున్నానంటూ దేవి నవ్వేశాడు. ఐతే తన పాటను కాపీ కొట్టినందుకు నిజానికి తనకు చాలా సంతోషంగా ఉందని.. ఇదీ మన రేంజ్ అని అతనెవరో ప్రపంచానికి చాటి చెప్పాడని దేవి అన్నాడు. దేవి స్పీచ్ తర్వాత సోషల్ మీడియాలో ‘ఊ అంటావా..’ కాపీ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాలీవుడ్ వాళ్లు కాపీ కొట్టే రేంజ్ దేవిది అంటూ అతణ్ని కొనియాడుతున్నారు. ఐతే అదే సమయంలో సూర్య సినిమాలో ‘వీడొక్కడే’లోని ‘హనీ హనీ’ పాట నుంచి దేవి ఇన్‌స్పైర్ అయ్యి ‘ఊ అంటావా’ చేశాడంటూ కొందరు కౌంటర్లు వేస్తుండడం గమనార్హం.

This post was last modified on June 29, 2025 2:42 pm

Share
Show comments
Published by
Kumar
Tags: DSPOo Antava

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

38 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

1 hour ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

2 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

2 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

3 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

6 hours ago