Movie News

బిగ్ బాస్ కొత్త సీజన్.. సస్పెన్స్ వీడింది

ఎక్కడో బ్రిటన్‌లో మొదలై.. ఇప్పుడు ఇండియాలో ఇంటింటికీ వచ్చేసిన టీవీ షో.. బిగ్ బాస్. ముందుగా హిందీ ప్రేక్షకులను అలరించిన ఈ టీవీ షో.. తర్వాత దక్షిణాది వారినీ అలరించడం మొదలుపెట్టింది. తెలుగులో ఈ షోకూ తిరుగులేని ఆదరణ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ తొలి సీజన్‌ను హోస్ట్ చేస్తే.. రెండో సీజన్లో నాని ఆ పాత్రను పోషించాడు. తర్వాతి సీజన్ నుంచి అక్కినేని నాగార్జున ‘బిగ్ బాస్’ను నడిపిస్తున్నారు. కొన్ని సీజన్ల తర్వాత నాగ్ స్థానంలోకి మరొకరు వస్తారంటూ ప్రతిసారీ చర్చ జరుగుతోంది కానీ.. తీరా షో మొదలయ్యే సమయానికి నాగార్జునే హోస్ట్‌గా కనిపిస్తున్నారు.

గత సీజన్ ముంగిట ఈ ప్రచారం గట్టిగా జరిగినా మార్పేమీ లేదు. ఈసారి కూడా అలాంటి ప్రచారమే నడిచింది. నాగ్ స్థానంలోకి విజయ్ దేవరకొండ వస్తాడని.. నందమూరి బాలకృష్ణతో సంప్రదింపులు జరుగుతున్నాయని.. ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ ఈసారి కూడా హోస్ట్‌ మారడం లేదు. ‘బిగ్ బాస్’ కొత్త సీజన్ ప్రోమోను తాజాగా స్టార్ మా లాంచ్ చేసింది. అందులో నాగార్జునే మెరిశారు. అంతే కాక కొత్త సీజన్‌ సరికొత్తగా ఉండబోతోందని నాగ్ హింట్ ఇచ్చారు. ఈసారి షోలో సెలబ్రెటీలు ఉండరట. అందరూ సామాన్యులేనట.

‘బిగ్ బాస్’ను ఫాలో అయ్యే వాళ్లే ఈ షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది స్టార్ మా. ఇందుకోసం వెబ్ సైట్లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. రిజిస్టర్ అయిన వాళ్ల నుంచే కంటెస్టెంట్లను ఎంచుకోబోతున్నారు. ఐతే పూర్తిగా అందరూ కొత్త వాళ్లే ఉంటారని కూడా చెప్పలేం. ముందు ఈ బ్యాచ్ నుంచి కంటెస్టెంట్లను ఎంచుకుని.. తర్వాత కొందరు సెలబ్రెటీలను జోడించే అవకాశముంది. అలా లేకపోతే షో ఆకర్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. జులై నెలాఖర్లో లేదా ఆగస్టు ప్రథమార్ధంలో ‘బిగ్ బాస్’ కొత్త సీజన్ మొదలవుతుందని భావిస్తున్నారు.

This post was last modified on June 29, 2025 12:05 pm

Share

Recent Posts

ట్విస్ట్…. నారాయణమ్మకు మూలం నవనీతమ్మ ?

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…

14 minutes ago

రిక్షా తోలుకోమంటున్న డిప్యూటీ సీఎం…

ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చేసిన సూచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యోగం…

1 hour ago

ఆ రోడ్డుపై వైసీపీ దుష్ప్రచారం.. ఖండించిన డిప్యూటీ సీఎంవో

ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…

2 hours ago

చీకట్లో మొబైల్‌ చూస్తున్నారా.. ఈ డేంజర్‌ గురించి తెలుసుకోండి..

రాత్రి నిద్రపోయే ముందు ఫోన్‌ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్‌ స్క్రీన్‌…

2 hours ago

వెంకీ త్రివిక్రమ్ సినిమా స్థాయి బజ్ ఉందా?

సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…

3 hours ago

పబ్లిక్ టాయిలెట్‌లో ఇద్దరు యువకులు మృతి… ఏం జరిగింది?

ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల…

3 hours ago