Movie News

కన్నడ ఇండస్ట్రీపై ‘సాహో’నటుడి తీవ్ర వ్యాఖ్యలు

ప్రకాష్ బెలవాడి.. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన టాలెంటెడ్ యాక్టర్. థియేటర్ టీచర్ అయిన ప్రకాష్.. నటుడిగానూ సత్తా చాటారు. ‘సాహో’ సినిమాలో షిండే అనే కీలక పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. బేసిగ్గా కన్నడ నటుడే అయినా.. హిందీలో ఆయన అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాంటి నటుడు తన సొంత ఫిలిం ఇండస్ట్రీ మీద ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కన్నడ ఇండస్ట్రీ అనాగరికమని.. దేశంతో దానంత వెనుకబడ్డ ఫిలిం ఇండస్ట్రీ లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు ఒక ఇంటర్వ్యూలో.

తాను కన్నడలో ఓ పెద్ద బేనర్లో నటించిన సినిమా చిత్రీకరణ సందర్భంగా ఎదురైన చేదు అనుభవాన్ని ప్రకాష్ బెలవాడి గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా కోసం తాను అడిగిన పారితోషకంలో ఏమీ తగ్గించుకోలేదని.. ఐతే తన రెమ్యూనరేషన్లను నాలుగు ఇన్‌స్టాల్మెంట్లు చేసి ఒక్కోెటిగా ఇచ్చిన నిర్మాణ సంస్థ.. చివరి భాగాన్ని మాత్రం ఇవ్వలేదని ఆయన చెప్పారు. పైగా చివరి రోజు చిత్రీకరణ సందర్భంగా తన కారవాన్లోకి వచ్చిన ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధులు.. టాయిలెట్లోకి వెళ్లి నీళ్లు మొత్తం ఖాళీ చేశారని.. పైగా నీళ్లను కారవాన్లో పారబోశారని.. తద్వారా తాను కారవాన్‌ను ఉపయోగించకుండా బయట ఎండలో ఉండేలా చేశారని ఆయన ఆరోపించారు.

ఈ నిర్మాణ సంస్థ పేరు తాను చెప్పలేనని.. ఎందుకంటే వాళ్లంటే తనకు భయమని ప్రకాష్ బెలవాడి తెలిపారు. మళ్లీ ఆ బేనర్లో సినిమా చేయమంటే, రోజుకు పది లక్షలు ఇస్తానన్నా తాను నటించనని ప్రకాష్ తెలిపాడు. ఈ బేనర్ అనే కాదని.. మొత్తంగా కన్నడ ఇండస్ట్రీలో పరిస్థితి బాగా లేదని.. వాళ్లకు ఆర్టిస్టులు, టెక్నీషియన్లను గౌరవించడం తెలియదని ప్రకాష్ బెలవాడి తెలిపారు. కన్నడలో అసలు కాంట్రాక్ట్ అన్నది ఉండదని.. దేశంలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో కాంట్రాక్ట్ చేసుకోని ఏకైక ఫిలిం ఇండస్ట్రీ అదొక్కటే అని ఆయన అన్నారు. బయటి భాషా చిత్రాల్లో తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని.. తనను అందరూ బాగా చూసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.

This post was last modified on June 27, 2025 6:46 pm

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

15 minutes ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

1 hour ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

2 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

6 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

6 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

8 hours ago