కొన్ని వారాల క్రితం వరకు ఉప్పు నిప్పులా పరస్పరం గొడవలు పడిన మంచు విష్ణు, మంచు మనోజ్ తర్వాత వాటిని పక్కనపెట్టారు. కలిసి పోలేదు కానీ ఆ రాద్ధాంతాన్ని మర్చిపోయి తమ కొత్త సినిమాల పనులు, ప్రమోషన్లలో బిజీ అయ్యారు. మనోజ్ గత నెల చివర్లో భైరవంతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. తాజాగా విష్ణు కన్నప్పతో ప్రేక్షకులను పలరించాడు. ఇవాళ పెద్ద ఎత్తున థియేటర్లలో రిలీజైన కన్నప్పకు ప్రభాస్ అభిమానుల నుంచి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. దాదాపు అన్ని సెంటర్లలో మొదటి రోజు షోలకు ఎక్కువ ఆక్యుపెన్సీలు అడ్వాన్స్ బుకింగ్ లోనే నమోదయ్యాయి.
ఇదిలా ఉండగా మంచు మనోజ్ ఇవాళ కన్నప్పను హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రీమియర్ షో చూశాడు. తన మానాన తాను వెళ్లిపోకుండా కెమెరాల సాక్షిగా మీడియాకు రివ్యూ ఇచ్చాడు. సినిమా చాలా బాగుందని, ప్రభాస్ వచ్చాక నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయిందని, క్లైమాక్స్ లో అంత గొప్ప పెర్ఫార్మన్స్ ఊహించలేదని విష్ణుని ఉద్దేశించి చెప్పాడు. ఊహించిన దానికన్నా వెయ్యి రెట్లు కన్నప్ప బాగుందని మనోజ్ చెప్పడం విశేషం. ఇదే విషయాన్ని గతంలో అడిగినప్పుడు ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నానని చెప్పడం వీడియో రూపంలో వైరలయ్యింది. ఇప్పుడు ఏకంగా కన్నప్పకు రివ్యూ ఇచ్చేశాడు.
దీన్ని బట్టి అన్నదమ్ముల మధ్య అన్ని సమిసిపోయాయని చెప్పడానికి లేదు కానీ కనీసం ఒక మంచి పరిమాణం మొదలైందని చెప్పొచ్చు. కన్నప్పకు మనోజ్ ఇంత పాజిటివ్ గా స్పందించడం పట్ల విష్ణు, మోహన్ బాబుల రియాక్షన్ ఇకపై ఏమైనా వస్తుందేమో చూడాలి. మొత్తానికి డీసెంట్ టాక్ అయితే పబ్లిక్ లో కనిపిస్తోంది. ప్రభాస్ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు కానీ విష్ణు కష్టం కూడా చిన్నది కాదు. మనోజ్ అన్నట్టు చివరి పది నిమిషాల్లో కెరీర్ బెస్ట్ నటన ఇచ్చాడు. బాక్సాఫీస్ స్టేటస్, కలెక్షన్లు గట్రా గురించి మాట్లాడ్డానికి ఇంకా టైం ఉంది కనక వీకెండ్ అయ్యేదాకా వేచి చూడాలి.
This post was last modified on June 27, 2025 2:20 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…