ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలోనే అతి పెద్ద హిట్లలో ఒకటి.. దంగల్. వరల్డ్ వైడ్ కలెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటే ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ ఇదే. ఫస్ట్ రిలీజ్‌లో వరల్డ్ వైడ్ రూ.800 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఆ తర్వాత చైనాలో విడుదలై రూ.1200 కోట్లకు పైగా కొల్లగొట్టింది. మొత్తంగా రూ.2 వేల కోట్లతో చరిత్ర సృష్టించింది. ఐతే ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం.. పాకిస్థాన్‌లో మాత్రం విడుదల కాలేదు. అక్కడ ఆమిర్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన అంతకుముందు చేసిన చిత్రాలు మంచి ఫలితాన్నీ అందుకున్నాయి. కానీ ‘దంగల్’ సినిమాలో భారత జెండాను, జాతీయ గీతాన్ని చూపించే సన్నివేశాలను తొలగించడానికి చిత్ర బృందం అంగీకరించకపోవడంతో పాక్‌లో నిషేధం తప్పలేదు.
ఈ నిర్ణయం తీసుకున్నది అప్పటి మంత్రి మరియం ఔరంగజేబ్. ఈ విషయమై ఆమె ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేయడం గమనార్హం. ఒక పాడ్ కాస్ట్‌లో ఆమె ఈ విషయమై తన అభిప్రాయాన్ని చెప్పారు. ‘‘నేను సమాచార శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ‘దంగల్’ రిలీజైంది. సెన్సార్ బోర్డు ప్రతినిధులు, సమాచార శాఖ అధికారులతో సమావేశం నిర్వహించాను. కొన్ని సన్నివేశాలను చూపిస్తూ సినిమాను పాకిస్థాన్‌లో నిషేధించాలని వారు సిఫారసు చేశారు. ఆ సినిమా చూడకుండానే నేను నిషేధానికి ఆమోదం తెలిపాను.
ఏడాదిన్నర తర్వాత ఆ సినిమా చూసే అవకాశం లభించింది. నా నిర్ణయం తప్పని అప్పుడు గ్రహించాను. అది అమ్మాయిలకు ఎంతో స్ఫూర్తిదాయకమైన సినిమా’’ అని మరియం పేర్కొన్నారు. తనను యాంటీ నేషనల్‌గా పేర్కొంటూ తన సినిమాలను ఓ వర్గం సోసల్ మీడియాలో టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఇటీవల ఆమిర్ ఓ ఇంటర్వ్యూలో ‘దంగల్’ను పాక్‌లో నిషేధించడంపై స్పందించారు. మన జాతీయ గీతం, జెండాకు సంబంధించిన సన్నివేశాలను తొలగించమంటే.. పాకిస్థాన్ నుంచి వచ్చే ఆదాయం వద్దనుకుని అందుకు నిరాకరించినట్లు ఆమిర్ గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on June 27, 2025 12:07 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…