టాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ చిత్రం.. కన్నప్ప. ఏకంగా రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి ఈ సినిమాను నిర్మించింది మంచు ఫ్యామిలీ. మంచు విష్ణు హీరోగా నటించడమే కాక.. ప్రొడక్షన్లో భాగమయ్యాడు. స్క్రిప్టులోనూ తన భాగస్వామ్యం ఉంది. మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మించడమే కాక ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కోసం పదేళ్ల కిందటే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎట్టకేలకు రెండేళ్ల కిందట చిత్రీకరణ దశలోకి వెళ్లింది. మేకింగ్ ఆలస్యమై.. రిలీజ్ కూడా వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు ఈ శుక్రవారం సినిమా రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ ఆల్ ద బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో పెద్ద పోస్టు పెట్టాడు. ఐతే మోహన్ బాబు సహా ఈ సినిమాలో భాగస్వామ్యం ఉన్న మంచు కుటుంబ సభ్యులందరికీ అతను విషెస్ చెప్పాడు కానీ.. తన అన్న మంచు విష్ణు పేరు మాత్రం ప్రస్తావించలేదు. కొంత కాలంగా విష్ణుకు, మనోజ్‌కు పెద్ద గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనోజ్.. విష్ణు పేరు ప్రస్తావించలేదు.
‘‘కన్నప్ప చిత్రానికి ఆల్ ద బెస్ట్. ఈ సినిమా కోసం నాన్న, ఆయన టీం ఎన్నో ఏళ్లు తమ కష్టాన్ని, ప్రేమను పెట్టింది. ఈ సనిమా బ్లాక్ బస్టర్ కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. మా లిటిల్ ఛాంప్స్ అరి, వివి, అవ్రామ్‌లకు సంబంధించి అందమైన జ్ఞాపకాలను బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. తనికెళ్ల భరణి గారి జీవిత కాల కల జీవం పోసుకుని శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుండడం ఎంతో సంతోషంగా ఉంది. మంచి మనసున్న ప్రభాస్ గారు, లెజెండరీ నటులు మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు.. ఇంకా ప్రభుదేవా గారు.. ఇలా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమా కోసం వీళ్లంతా చేసిన సాయం, చూపించిన ప్రేమ, నమ్మకం.. ఎంతో గొప్పవి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ ప్రయాణానికి పరమేశ్వరుడి ఆశీస్సులు, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నా’’ అని మనోజ్ పేర్కొన్నాడు.
This post was last modified on June 26, 2025 4:57 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…