Movie News

బిచ్చగాడు-3 కూడా.. డైరెక్టర్ ఎవరంటే?

సౌత్ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రాల్లో ‘బిచ్చగాడు’ ఒకటి. ఈ సినిమా రిలీజవుతున్నపుడు పెద్దగా అంచనాలే లేవు. తమిళంలో అయినా పర్వాలేదు కానీ.. తెలుగు వాళ్లయితే రిలీజ్ రోజు ఈ చిత్రాన్ని అస్సలు పట్టించుకోలేదు. అసలు ‘బిచ్చగాడు’ అనే టైటిల్‌తో సినిమా ఏంటి అనుకున్నారు. కానీ రిలీజైన కొన్ని రోజులకు ఈ సినిమాకు అనూహ్యంగా స్పందన పెరిగిపోయింది. రివ్యూలు, మౌత్ పబ్లిసిటీ తోడై సినిమా ఊహించని స్థాయికి వెళ్లిపోయింది. మహేష్ బాబు సినిమా ‘బ్రహ్మోత్సవం’ మీద ఈ చిత్రం పైచేయి సాధించడం విశేషం. కొన్ని వారాల పాటు రన్ అయిన ఈ చిత్రం.. ఓటీటీలో కూడా అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. 

ఈ మూవీతోనే సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ హీరోగా స్టార్ ఇమేజ్ సంపాదించాడు. కానీ ఆ తర్వాత విజయ్ నుంచి చాలా సినిమాలు వచ్చాయి కానీ.. అవేవీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. చాలా ఏళ్ల తర్వాత అతడికి మళ్లీ సక్సెస్ అందింది ‘బిచ్చగాడు-2’తోనే. ఆ సినిమాకు మిక్స్డ్ రివ్యూలే వచ్చినప్పటికీ ‘బిచ్చగాడు’ సీక్వెల్ కావడం వల్ల వసూళ్లు బాగానే వచ్చాయి. ‘బిచ్చగాడు-2’ తర్వాత విజయ్ ఆంటోనీ కెరీర్ మళ్లీ తిరోగమనంలోనే పయనిస్తోంది.

ఇప్పుడు ‘మార్గన్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్ ఆంటోనీ.. ‘బిచ్చగాడు-3’ గురించి అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతామని.. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజవుతుందని ప్రకటించాడు. ‘బిచ్చగాడు’ను డైరెక్ట్ చేసింది ‘శీను’ ఫేమ్ శశి కాాగా.. సీక్వెల్‌కు ఆయన పని చేయలేదు. విజయ్ ఆంటోనీనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు ‘బిచ్చగాడు-3’ని కూడా విజయే డైరెక్ట్ చేయబోతున్నాడట. తన సొంత నిర్మాణ సంస్థ ‘విజయ్ ఆంటోనీ ఫిలిమ్స్’ బేనర్లోనే ఈ సినిమాను కూడా అతను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.

This post was last modified on June 26, 2025 3:23 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

35 minutes ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

1 hour ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

2 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

3 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

3 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

4 hours ago