నాని, చై జాన్తానై.. తారక్ తోనే సై!

లాక్ డౌన్ అవడం వల్ల కొందరు మాత్రమే ఇంట్లో ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళున్నారు అన్నట్టు వార్తలు వండేస్తున్నారు సినిమా జర్నలిస్టులు. అసలు షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలియక అందరూ అయోమయంలో వుంటే… లాక్ డౌన్ ఎత్తేయడం ఆలస్యం… కెమెరా భుజాన వేసుకుని షూటింగ్ చేసేస్తారని రాసేస్తున్నారు. పైగా ఈ లాక్ డౌన్ వల్ల అన్ని సినిమాలూ ఆగిపోతే, సదరు హీరోలు ఇప్పట్లో ఖాళీ ఎవరు కనుక వాళ్ళతో సినిమాలు అనుకున్న దర్శకులు వేరే చిత్రాలు చేస్తారని ప్రచారం చేసేస్తున్నారు.

త్రివిక్రమ్ తదుపరి చిత్రం తారక్ తో అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. తారక్ కొన్నాళ్ళు ఆర్.ఆర్.ఆర్. తో బిజీగా ఉంటాడు కనుక త్రివిక్రమ్ ఈలోగా నాని లేదా నాగ చైతన్యతో ఒక సినిమా లాగించేస్తాడని రాస్తున్నారు. పోనీ త్రివిక్రమ్ ఖాళీగా ఉన్నాడు అనుకున్నా నాని, చైతన్య సినిమాలు మధ్యలో ఆగిపోయి లేవా? ఇంత లాజిక్ ఎవడు ఆలోచిస్తాడండీ.. లాక్ డౌన్ లో న్యూస్ లేక ఏదోకటి వండాల్సిన సిట్యుయేషన్ అర్ధం చేసుకోక అంటారేమో. అంతేలెండి.. ఎవరి పాట్లు వారివిపుడు.