ఒకప్పుడు యానిమేషన్లకు విపరీతమైన క్రేజ్ ఉండేది కానీ ఎప్పుడైతే సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ డామినేషన్ మొదలయ్యిందో అక్కడి నుంచి సీన్ మారిపోయింది. కానీ సలార్, కెజిఎఫ్ నిర్మాతలు హోంబాలే ఫిలిమ్స్ ఈ రంగంలో కొత్త రకం విప్లవం తెచ్చేందుకు సిద్ధ పడుతున్నారు. మహావిష్ణు అవతారాలను ఆధారంగా చేసుకుని 2025 తో మొదలుపెట్టి 2037 దాకా అంటే పన్నెండు సంవత్సరాలకు సరిపడా ఒక యునివర్స్ లైనప్ సిద్ధం చేస్తోంది. అంతే కాదు ఏ సంవత్సరంలో ఏది విడుదలవుతుందో ముందే చెప్పేస్తున్నారు. ఈ సిరీస్ లో మొదటి భాగం మహావతార్ నరసింహ జూలై 25 థియేటర్లలో రిలీజ్ కానుంది.
దీని తర్వాత పరశురామ్, రఘునందన్, ద్వారకేష్, గోకులానందా, కల్కి పార్ట్ 1, కల్కి పార్ట్ 2 ఇలా మొత్తం ఏడు సినిమాలని ఒక ప్యాకేజ్ గా అందించబోతున్నారు. ఇవన్నీ యానిమేషన్ లోనే ఉంటాయి. కాకపోతే విజువల్స్ రిచ్ గా నిజమేనా మనుషులను చూస్తున్న భ్రమను కలిగించేలా ఉంటాయని టీమ్ చెబుతోంది. ఈ తరహా ప్రయోగం గతంలో కొచ్చడయాన్ తో రజనీకాంత్ చేశారు కానీ ఆశించిన ఫలితం అందుకోలేదు. కానీ మహావీర్ సిరీస్ అలా ఉండదట. చిన్నా పెద్ద అబ్బురపడే స్థాయిలో గ్రాఫిక్స్ తో పాటు అందరూ తెలుసుకోవాల్సిన ఇతిహాసాలను అర్ధమయ్యే రీతిలో చూపించడం మహావీర్ ప్రధాన లక్ష్యమట.
ఒకపక్క ప్యాన్ ఇండియా సినిమాలతో వేల కోట్ల పెట్టుబడులను పారిస్తున్న హోంబాలే ఫిలిమ్స్ ఇప్పుడీ యానిమేషన్ ప్రపంచం ద్వారా మరో సంచలనానికి శ్రీకారం చుడుతోంది. అసలే ఏఐ టెక్నాలజీ తాలూకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో సోషల్ మీడియాలో శాంపిల్స్ రూపంలో చూస్తున్నాం. అలాంటిది ఒక అగ్ర నిర్మాణ సంస్థ యానిమేషన్ ట్రెండ్ సెట్ చేయడానికి పూనుకుంటే దానికి ఏఐ చేసే మేలు గురించి వేరే చెప్పాలా. బెంగళూరు టాక్ ప్రకారం మహావీర్ లో ఎలాంటి రియల్ టైం యాక్టర్స్ ఉండరు. కృత్రిమంగా సృష్టించబడిన పాత్రలే తెరమీద అద్భుతాలు చేయబోతున్నాయి. చూడాలి ఎలాంటి స్పందన వస్తుందో.
This post was last modified on June 25, 2025 9:16 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…