కేవలం యాభై శాతం సీట్లు మాత్రమే అమ్మడానికి సినిమా థియేటర్ల ఓనర్లు ఓకే అంటున్నారు. అయితే ఎప్పటిలా ఫుల్ థియేటర్ రెంట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. సగం టికెట్లు మాత్రమే అమ్ముకుని మొత్తం రెంట్ ఎలా ఇస్తామని డిస్ట్రిబ్యూటర్లు అభ్యంతరం చెబుతున్నారు. టికెట్ రేట్లు డబుల్ చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేదు.
ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా కానీ పెద్ద సినిమాలకు తప్ప ఈ డబుల్ రేట్లు చిన్న చిత్రాలకు వర్కవుట్ అవ్వవు. అందుకే సంక్రాంతికి రిలీజ్ డేట్లు ప్రకటించినప్పటికీ సినిమాలు యథావిధిగా విడుదలవుతాయనే నమ్మకం లేదు. వంద శాతం టికెట్లు అమ్ముకోవడానికి పర్మిషన్ రాని పక్షంలో కొత్త సినిమాల విడుదల వేసవికి వాయిదా పడవచ్చు.
ఢిల్లీలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైందనే వార్తలు టాలీవుడ్‍కి గుబులు పుట్టిస్తున్నాయి. అంతా భయపడుతున్నట్టు డిసెంబర్ నాటికి తెలుగు రాష్ట్రాలలో మళ్లీ కేసులు పెరిగినట్టయితే ఇక సంక్రాంతి సీజన్‍పై పూర్తిగా ఆశలు వదిలేసుకోవచ్చు. సంక్రాంతికి నాలుగైదొందల కోట్ల బిజినెస్ చేసే కెపాసిటీ వుందని ప్రూవ్ అయిన సందర్భంలో సంక్రాంతి సీజన్‍ని కూడా మిస్ అయితే తెలుగు చిత్ర పరిశ్రమ కోలుకోవడం చాలా కష్టతరమవుతుంది.
This post was last modified on November 13, 2020 9:47 am
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…
మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…
ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా…
2008లో 166 మందిని పొట్టనపెట్టుకున్న ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడైన తహావూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారత్‌కు…