‘పెళ్ళిచూపులు’ సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసి, ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. తన రెండో చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’ థియేటర్లలో అనుకున్నంతగా ఆడలేదు కానీ.. ఓటీటీలో, టీవీల్లో ఈ సినిమాను జనం బాగానే చూశారు. కాల క్రమంలో దానికి కల్ట్ స్టేటస్ వచ్చింది. గత ఏడాది ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూశారు. యూత్ ఊగిపోయారు. థియేటర్లలో సెలబ్రేషన్స్ చూసి అందరూ షాకయ్యారు.
ఫస్ట్ టైం థియేటర్ల నుంచి వచ్చిన ఆదాయం కంటే రీ రిలీజ్ కలెక్షన్ ఎక్కువ కావడం విశేషం. ఈ ఉత్సాహంలో ఈ చిత్రానికి సీక్వెల్ చేయడానికి రెడీ అయ్యాడు తరుణ్. అఫీషియల్‌గా ప్రకటించకపోయినా.. ఈ సీక్వెల్ గురించి ఎప్పటికప్పుడు అతను హింట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అఫీషియల్ అప్‌డేట్‌తో రాబోతున్నాడు తరుణ్. ఈ నెల 29న ‘ఈ నగరానికి ఏమైంది-2’ను అధికారికంగా ప్రకటించబోతున్నాడు తరుణ్ భాస్కర్.
దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో హింట్ ఇచ్చాడు తరుణ్. ‘ఈ నగరానికి ఏమైంది’ ప్రధాన పాత్రధారులు విశ్వక్సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమానులను ట్యాగ్ చేసి.. ఈ నెల 29వ తేదీకి ఎగ్జైటెడ్‌గా ఉన్నారా అని అడిగాడు తరుణ్. అతను ట్యాగ్ చేసిన వ్యక్తులను బట్టి ఇది ‘ఈ నగరానికి ఏమైంది-2’ గురించి ప్రకటనే అని అర్థమైంది. తొలి చిత్రంలో ప్రధాన పాత్రధారులందరూ సీక్వెల్లోనూ నటించబోతున్నారని కూడా స్పష్టమైంది. ఇది ‘ఈ నగరానికి ఏమైంది’ అభిమానులను మరింత ఎగ్జైట్ చేసే విషయం.
బహుశా ఇది ప్రాపర్ సీక్వెల్ అయి ఉండొచ్చు. ఆయా వ్యక్తుల జీవితాలు కొన్నేళ్ల తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తూ ఈ సినిమా తీయబోతున్నాడన్నమాట తరుణ్. దర్శకుడిగా గొప్ప అభిరుచి ఉన్నా.. తరచుగా సినిమాలు చేయడన్నది తరుణ్ మీద తన అభిమానుల్లో ఉన్న కంప్లైంట్. చివరగా ‘కీడాకోలా’తో ఓ మోస్తరు ఫలితాన్నందుకున్న తరుణ్.. ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ పెద్ద సక్సెసే అయ్యే అవకాశముంది.
This post was last modified on June 22, 2025 5:03 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…